Wednesday, May 8, 2024
- Advertisement -

సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్న బుడ్డోడి వీడియో..?

- Advertisement -

తాజాగా ఓ బుడ్డోడు బాగాలేదని డాక్టర్ దగ్గరకు వచ్చాడు.ఆ డాక్టర్ ఏం బాగాలేదని దగ్గరికి తీసుకోబోతుంటే వద్దు సార్ ఆడనే ఉండు దగ్గరకు రాకు అంటూ అక్కడ రచ్చ రచ్చ చేసేసాడు.ఆ బుడ్డోడు రచ్చ చూసినవారంతా నవ్వుకుంటూ తమ ఫోన్లకు పని చెప్పారు.ఆతరువాత ఆ బుడత వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోలోని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓ బుడ్డోడు చేయి బాగాలేదని హాస్పిటల్ కు నాన్నతో కలిసి వెళ్ళాడు.ఇక ఆ బుడ్డోడు చేతిని చూడడానికి అక్కడున్న సిబ్బంది ప్రయత్నిస్తుంటే వద్దు దూరంగా ఉండు సార్ అంటూ గోల చేశాడు. ఆ చేయి వెనక్కి ఇలా పెట్టు అని అక్కడ డాక్టర్ చేతిని పట్టుకోబోతుంటే సార్ దూరంగా ఉండు నాకు చూపీ నేను చేస్తా అంతేకాని కాళ్ళు,చేతులు పట్టుకోకండి అని తెగ హడి విడి చేశాడు.సరే నొప్పి ఏడ ఉంది చెప్పు అని డాక్టర్ అడిగినప్పుడు ఆ బుడ్డోడు సమాధానం చెప్పలేకపోయాడు.ఇక నానా తిప్పలు పడి పాపం డాక్టర్ ఆ బుడ్డోడికి నొప్పి కనుక్కొని అతడికి ట్రీట్ మెంట్ ఇచ్చాడు.

పాపం నొప్పి ఎక్కడ చెప్పలేక ఎవరైనా చేయి పట్టుకుంటే తట్టుకోలేక ఆ బుడ్డోడు చేసిన హడావిడి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మరి ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -