Saturday, April 27, 2024
- Advertisement -

కరెన్సీ వద్దు డిజిటిల్ ముద్దు..!

- Advertisement -

కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచం దేశాల్లో ఈ వ్యాధి విస్తరించింది. భారతదేశంలో కూడా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంది. కావున కేంద్ర ప్రభుత్వం తగ్గిన జాగ్రత్తలు ఇప్పటికే తీసుకుంటుంది. బయటకు వెళ్ళొద్దని.. కొంచెం సిక్ గా ఉన్న ఇంట్లోనే ఉండాలని.. ఎక్కువ సార్లు చేతులు శుభ్రపరుచుకోవాలని.. తుమ్మటం, దగ్గడం వంటివి చేసినప్పుడు అడ్డుగా ఖర్చీఫ్ వాడాలని.. అత్యవసర పరిస్థితులు ఉంటే మాస్కు ధరించి బయటకు వెళ్ళాలని సూచిస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే దేశంలోని అన్ని రాష్ట్రాలు తగిన జాగ్రత్తలతో పాటుగా స్కూల్స్, థియేటర్స్, మీటింగ్ హాల్స్, ఫంక్షన్స్ ఇలా రద్దిగా ఉండే ప్రదేశాలను అన్నింటిని కొన్ని రోజుల వరకు బంద్ చేసింది.

ఈ క్రమంలో ప్రస్తుతం కరోనా ఒకరి నుంచి ఒకరికి వస్తోంది కాబట్టి ప్రజలు అప్రమత్తగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. షెక్ హ్యాండ్.. ఒకరు తాకిన వస్తున్న మరో వ్యక్తి తాకడం వంటివి చేయొద్దని చెబుతున్నారు. కరెన్సీ ద్వారా కరోనా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే కరోనా ఉన్న వ్యక్తి తన కరెన్సీని తాకి… మరో వ్యక్తి అదే కరెన్సీని తాకడం వల్ల కూడా ఈ కరోనా వచ్చే ఛాన్స్ ఉంది. భారతదేశంలో ఈ కరోనా స్టార్టింగ్ స్టేజిలో ఉంది కాబట్టి కరెన్సీ ని ఎక్కువగా వాడకుండా యుపిఐ, ఐఎంపిఎస్, ఆర్టిజిఎస్, మొబైల్ వాలెట్లు మరియు నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు ఉపయోగించుకోవడం వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చని సర్వత్రా టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు మందార్‌ అగాషే వెల్లడించారు.

కరెన్సీ ఒకరి దగ్గర నుంచి మరో వ్యక్తి దగ్గరకు కొద్ది క్షణాల్లో మారుతూ ఉంటుంది. ఇలా కరోనా ఉన్న వ్యక్తి కరెన్సీ మరో వ్యక్తి ఉపయోగించి.. అలానే ఆ కరెన్సీ మరో వ్యక్తి దగ్గరకు వెళ్లి.. ఇలా వ్యాప్తిస్తునే ఉంటుందన్న కారణంగా కరెన్సీకి బదులుగా ఆన్ లైన్ చెల్లిపులు జరిపితే కరోనా ప్రమాదాన్ని తగ్గించవచ్చని అంటున్నారు. కరోనావైరస్ వ్యాప్తి యొక్క ప్రారంభ దశలో భారత్ ఇంకా ఉంది మరియు వ్యాప్తిని నివారించడానికి అనేక ముందు జాగ్రత్త చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. “అయితే, ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు ముందుకు సాగవచ్చు మరియు యుపిఐ, ఐఎమ్‌పిఎస్, ఆర్‌టిజిఎస్, మొబైల్ వాలెట్లు మరియు నెట్ బ్యాంకింగ్ వంటి చెల్లింపు రీతులు ఈ కరోణ వ్యాప్తి చెందకుండా దోహదపడతాయని వెల్లడించారు.

కరెన్సీ నోట్ల ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇతర చర్యల గురించి అగాషే మాట్లాడుతూ.. కరెన్సీ లేని చెల్లింపు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని.. కరోనా సోకకుండా అన్ని రకల చర్యల్లో ఇది కూడా ముఖ్యమైనదే అని.. కాబట్టి ఆన్ లైన్ లావాదేవిలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఇక ప్రపంచంలో ఇప్పటి వరకూ 157 దేశాలకు కరోనా వైరస్ విస్తరించిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ వ్యాధి బారిన మొత్తం 1,69,531 మంది పడ్డారని.. అందులో 6,515 మంది మరణించారని నిర్ధారించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -