Saturday, April 27, 2024
- Advertisement -

ఫ‌ల‌క్‌నామా ప్యాలేస్‌కు బాంబు బెదిరింపు కాల్‌….

- Advertisement -

జీఈఎస్‌ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు పసందైన విందుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్‌నుమా ప్యాలేస్‌లో ఆతిథ్యం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అథిదుల‌కు పసందైన రుచులు పంచుతున్న సమయంలో బాంబు ఉంద‌ని వ‌చ్చిన ఫోన్ కాల్ క‌ల‌క‌లం రేపింది. బెదిరింపు ఫోన్ కాల్ ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఫలక్‌ నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్‌ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్‌ కాల్ వచ్చింది. ఫలక్‌ నుమా పరిసరాల్లో బాంబు పెట్టామని, ఏ నిమిషంలో అయినా పేలుతుందంటూ ఆగంతకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, నిన్న రాత్రంతా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం దాన్ని బెదిరింపు కాల్‌గా పోలీసులు గుర్తించారు.

ఐదంచెల ఇవాంకా భద్రతతో సహా, జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇతర భద్రతాధికారులు సర్వసన్నద్ధంగా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు సలహాదారు ఇవాంకా ట్రంప్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు, టాటా, మిట్టల్ తో పాటు 150 దేశాలకు చెందిన సుమారు 1500 మంది ప్రముఖ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చారిత్రాత్మక ఫలక్‌ నుమా ప్యాలెస్‌ లో విందారగిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేశాడు.

ఫలక్‌ నుమా ప్యాలెస్‌లో బాంబు పెట్టినట్లు వచ్చిన బెదిరింపు కాల్‌ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బెదిరింపు ఫోన్‌ కాల్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఘటనకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ ఫోన్‌ కాల్‌ పాతబస్తీ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించార.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -