Saturday, April 27, 2024
- Advertisement -

తేజాస్ యుద్ధ విమానంలో విహరించిన ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్…

- Advertisement -

స్వదేశీ పరిజ్ణానంతో రూపొందించిన తేలిక పాటి యుద్ధ విమానం తేజాస్ లో ఇవాలా కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించారు. బెంగుళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్ర‌యం నుంచి ఆయ‌న లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో విహ‌రించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్దవిమానం తేజస్‌లో ప్రయాణించిన మొట్టమొదటి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కావడం విశేషం.

సుమారు 30 నిమిషాల పాటు రాజ్‌నాథ్.. తేజ‌స్‌లో ప్ర‌యాణించారు. చాలా స్మూత్‌గా, కంఫ‌ర్ట‌బుల్‌గా ప్ర‌యాణం సాగిన‌ట్లు రాజ్‌నాథ్ ట్విట్టర్ లో తెలిపారు. తేజ‌స్ ట్రిప్‌ను ఎంజాయ్ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. భారత వాయుసేనను తేజస్ మరింత పటిష్టం చేస్తుందని.. అనేక క్లిష్ట సందర్భాల్లో సమర్థవంతంగా తేజాస్ పనిచేయగలదని ధీమా వ్యక్తం చేశారు.

మొదట 40 తేజస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం భారత వాయుసేన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.ఆ తర్వాత మరో 83 తేజస్ ఫైటర్స్‌ను సమకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. వీటి విలువ సుమారు రూ.50వేల కోట్లు. తేజస్ ఫైటర్ తరహా యుద్ద నౌక ప్రస్తుతం తయారీదశలో ఉంది.

తేజ‌స్ దాదాపు ధ్వ‌ని వేగంతో స‌మానంగా ప్ర‌యాణించిన‌ట్లు తెలుస్తోంది. సార్టీలో మాక్ వ‌న్ రేంజ్‌ను అందుకున్నారు. అంటే గంట‌కు 1235 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్లి ఉంటారు. తేజ‌స్ న‌డ‌ప‌డంపై థ్రిల్ అయిన‌ట్లు మంత్రి చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -