Friday, April 26, 2024
- Advertisement -

టీటీడీ ఛైర్మెన్‌గా వైవి….అమ‌ర‌నాధ్ రెడ్డికి ఎమ్మెల్సీ

- Advertisement -

టీటీడీ ఛైర్మెన్‌గా వైవి సుబ్బారెడ్డిని నియ‌మిస్తూ సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. నియామకపు ఉత్తర్వులను టీటీడీ ఈవో అశోక్ సింఘాల్ కు ఫ్యాక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు శ్రీవారి సమక్షంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు వైవీకి కీలక పదవిని ఇస్తూ, జగన్ పత్రాలపై సంతకం చేశారు.

కొత్త ప్ర‌భుత్వాలు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నె దేవాల‌యాల పాల‌క మండ‌ల్ల‌కు ఉన్న చైర్మెన్‌లు రాజీనామా చేయాల్సిందే. కాని వైసీపీ అధికారంలోకి వ‌చ్చినా టీడీపీ నేత పుట్టా సుధాక‌ర్ టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండా భీష్మించుకుని కూర్చున్నారు. పాల‌క మండ‌ళ్ల‌ర‌ద్దుకు ఆర్డినెన్స్ తీసుకొస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో రెండు రోల క్రితం టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌వికి పుట్టా రాజీనామా చేశారు.

వైవి సుబ్బారెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పడుతుందని, సభ్యులుగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని జగన్ స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైవికి ఎంపీసీటు కేటాయించ‌క‌పోవ‌డంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్ట కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న‌సంగ‌తి తెలిసిందే. స్వ‌యంగా జ‌గ‌న్ జోక్యం చేసుకొని టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇవ్వ‌డంతో అంతా స‌ర్దుకుంది.

టీటీడీ ఛైర్మెన్ రేసులో ఉన్న నేత రాజంపేట‌కు చెందిన అమ‌ర‌నాధ్‌రెడ్డి. టీడీపీ నుంచి మేడా వైసీపీలో చేర‌డంతో అమ‌ర‌నాధ్ రెడ్డికి టికెట్ ఇవ్వ‌లేదు జ‌గ‌న్. అదే స‌మ‌యంలో టీటీడీ ఛైర్మెన్ గా అవ‌కాశం ఇస్తాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో మేడా గెలుపుకు కృష్టిచేశారు. అయితే కొన్ని రాజ‌కీయ ప‌రిస్థితులు దృష్యా ఆయ‌నకు జ‌గ‌న్ ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తున్నాట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -