ఆయోధ్య హిందువులదే : సుప్రీం కోర్టు

1006
Hindus get entire disputed 2.77-acres for Ram Mandir
Hindus get entire disputed 2.77-acres for Ram Mandir

దాదాపు ఒకతరం.. కొన్ని వందల వాదనలు.. లెక్కలేనని ప్రశ్నల మధ్య ఆయోధ్య కేసులో తుది తీర్పు ఈ రోజు వెల్లడైంది. ఎన్నో ఏళ్ళుగా వివాదస్పదంగానే ఉన్న స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తెలిపుతూ ఆయోధ్యలో రామమందిరం నిర్మించుకోవచ్చని చెప్పింది.

ఆయోధ్య వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలు ఉంది. 16వ శతాబ్దం నుంచి ఇక్కడ బాబ్రీ మసీదు ఉంది. 1992లో ఈ బాబ్రీ మసీదును కూల్చివేయడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అప్పటి నుంచి ఈ వివాదం అలాగే కోనసాగుతోంది. బాబ్రీ మసీదు కంటే ముందే ఆయోధ్యలో రామమందీరం ఉందని.. రాముడి జన్మస్థానం అదేనని హిందువుల విశ్వాసం.

ఆ కారణం చేతనే ఇరువర్గాలు ఆయోధ్య విషయంలో గొడవ పడుతునే ఉన్నాయి. ఎట్టకేలకు సుప్రీం కోర్టు చీఫ్ జెస్టీస్ గొగోయ్ ఆధ్వర్యంలో తుది తీర్పు బయటకు వచ్చింది. నిర్ణయానికి ముందు ఇరు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఆయోధ్య కోసం కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ముస్లీంలకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సుప్రీకోర్టు సూచించింది.

Loading...