Friday, April 26, 2024
- Advertisement -

ఇరాక్‌లో ఘోర ప్ర‌మాదం..100 మంది జ‌ల‌స‌మాధి..

- Advertisement -

ఇరాక్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. 100 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు. మోసుల్‌కు సమీపంలోని టైగ్రిస్ నదిలో పడవ మునిగి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. కుర్దులు నౌరుజ్ అనే పండుగను జరుపుకునేందుకు వేలాది మంది టైగ్రిస్ నది సమీపంలోకి చేరుకున్నారు. ఉమ్ రబేయిన్ ద్వీపానికి పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.

ప్రమాదం జరిగినప్పుడు నదిలో వేరే పడవలు ప్రయాణించకపోవడంతో బాధితులను రక్షించే అవకాశం లభించలేదని, దీంతో మృతుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మృతుల్లో 61మంది మహిళలు, 19 మంది చిన్నారులు ఉన్నారు. ఇందులో 55 మందిని రక్షించామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని సహాయక సిబ్బంది తెలిపారు. మోసుల్ డ్యామ్ నుంచి ఇటీవల నీటిని విడుదల చేయడంతో టైగ్రిస్ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. వర్షాలు కూడా కురుస్తుండటంతో నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో నీటికి ఎదురువెళ్లడం ప్రమాదకరమని హెచ్చరికలు జారీచేసినా పడవ నిర్వాహకులు పెడచెవిన పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -