Saturday, April 27, 2024
- Advertisement -

తాజ్ మహల్ కు వెళ్లొచ్చు.. కరోనా తర్వాత కీలక పరిణామం..?

- Advertisement -

అన్‌లాక్‌-4లో క్ర‌మంగా అన్నింటిపైనా ఆంక్ష‌లు ఎత్తివేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా ప‌ర్యాట‌క ప్రాంతాలు, ద‌ర్శ‌నీయ స్థలాల‌ను తెరుస్తున్నారు. ఇవాళ్టి నుంచి తాజ్‌ మహల్‌, ఆగ్రా ఫోర్ట్‌ను సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులోకి తీస‌కొస్తున్నారు. కొవిడ్-19‌ మార్గదర్శకాలను పాటిస్తూ పర్యాటకులకు అనుమతి ఇస్తున్నారు. దీంతో ఉద‌యం నుంచే ఆయా ప్రాంతాల వ‌ద్ద సంద‌డి క‌నిపిస్తోంది.

తాజ్‌మ‌హ‌ల్ సంద‌ర్శ‌న‌కు రోజుకు 5 వేల మంది పర్యాటకులకు మాత్రమే అనుమతి ఇవ్వ‌నున్నారు. మధ్యాహ్నం వరకు 2500, ఆ తర్వాత మరో 2500 మందికి అవకాశం కల్పిస్తారు. పేపర్‌ టికెట్లకు బ‌దులు.. ఎలక్ట్రానిక్‌ టికెట్లను అధికారులు జారీ చేస్తున్నారు. థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్, మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రిగా చేశారు.

కోరోనా వ్యాప్తి కారణంగా మార్చి 17 నుంచి దేశ‌వ్యాప్తంగా అనేక‌ పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. దాదాపు ఆరు నెలల తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు తిరిగి అనుమతి ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -