Friday, April 26, 2024
- Advertisement -

బీజేపీ మ్యేనిఫెస్టో…

- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వరాల జల్లుతో బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ ‘సంకల్ప్ భారత్, సశక్త్ భారత్’పేరుతో తమ మేనిఫేస్టోను విడుదల చేశారు. బీజేపీ తన మ్యానిఫెస్టోలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు వంటి గత హామీలను ప్రస్తావిస్తూనే రైతులు, చిరువ్యాపారులను ఆకట్టుకునేందుకు పలు వాగ్దానాలు చేసింది.
బీజేపీ మ్యేనిఫెస్టోలోని అంశాలు..

:రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉంటాం
:జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు
:చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్లు
:రైతులకు ఏటా రూ 6000 నగదు సాయం
:రైతులకు వడ్డీ లేకుండా రుణాలు
:2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
:వ్యవసాయం, గ్రామీణ రంగాల్లో రూ 25 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ
:కిసాన్‌ సమ్మాన్‌ యోజన విస్తరణ
:ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధల్లో భారత్‌ను ఒకటిగా తీర్చిదిద్దడం
:ఉగ్రవాదంపై రాజీలేని పోరు
:మౌలిక రంగంలో 100 లక్షల కోట్ల పెట్టుబడులు
:చిన్న వ్యాపారులకు రూ 10 లక్షల ప్రమాద బీమా
:2022 నాటికి హైవేలను రెట్టింపు చేయడం
:జాతీయ వర్తక సంక్షేమ బోర్డు ఏర్పాటు
:గుర్తింపు పొందిన వ్యాపారులకు క్రెడిట్‌ కార్డులు
:అందరికీ విద్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -