బిజినెస్ మాన్ అనిపించుకున్న నాగార్జున

728
Nagarjuna's Remuneration For Bigg Boss Telugu 3
Nagarjuna's Remuneration For Bigg Boss Telugu 3

సినిమా పరిశ్రమ లో నాగార్జున అక్కినేని కి మించిన నిర్మాత ఇంకొకరు ఉండరు. హీరో గా ఎలా నెగ్గుకురావాలో మాత్రమే కాకుండా ఒక నిర్మాత గా, మరీ ముఖ్యం గా బిజినెస్ మాన్ గా కూడా ఎలా నిలదొక్కుకోవాలి అనే విషయం మీద నాగార్జున కి ఉన్న క్లారిటీ ఇంకొక తెలుగు హీరో కి లేదు అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే నాగార్జున కూడా కొన్ని కొన్ని సార్లు అవతలి వాళ్ళ అవసరాన్ని భలే చాకచక్యం గా క్యాష్ చేసుకుంటాడు అనడానికి ఈ మధ్య ఒక జరిగిన ఒక సంఘటన ఉదాహరణ గా చెప్పొచ్చు.

బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జున ని సంప్రదించిన చాన్నాళ్ళకి గానీ ఆయన ఒప్పందం మీద సంతకం చేయలేదు. మీడియా లో బాగా వార్తలు వచ్చి, బిగ్ బాస్ నిర్వాహకులకు ఇక నాగార్జున తప్ప ఇంకో ఆప్షన్ లేదు అనే వరకు తీసుకొని వచ్చి వాళ్ళ అవసరాన్ని కాష్ చేసుకున్నాడట నాగార్జున. ఈ మూడో సీజన్ కి హోస్ట్ చేయడానికి నాగార్జున దాదాపుగా 12 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు అని తెలిసింది.

అయితే ఇది నాని, ఎన్టీఆర్ తీసుకున్న మొత్తం కన్నా చాలా ఎక్కువ అని టాక్. మరి ఆ బడ్జెట్ కి నాగార్జున ఏ మాత్రం న్యాయం చేస్తాడో చూడాలి.

Loading...