Saturday, April 27, 2024
- Advertisement -

ఏపీని ముంచేస్తున్న‘పెథాయ్’ తుఫాను

- Advertisement -

ఏపీకి వ‌రుస తుపాన్‌లు దాడి చేస్తున్నాయి. తాజాగా ఏపీని మ‌రో తుపాన్ ముంచేస్తుంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘పెథాయ్’’ తుఫాను ఆంధ్రప్రదేశ్‌పై త‌న ప్రభావం చూపిస్తుంది.‘పెథాయ్’ కాకినాడకు 670 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణా ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాన్ ప్ర‌భావంతో ఆది, సోమవారాల్లో గంటకు 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ తుపాన్ ప్ర‌భావం పడ‌నుంద‌ని వాతావరణ కేంద్రం తెలిపింది.‘పెథాయ్’ తీవ్రత దృష్ట్యా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.తీర ప్రాంతాల్లో కెరటాలు 6 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడే అవకాశముందని పేర్కొంది. తుఫాను తీరం దాటే వరకు జనం ఇళ్లలోనే ఉండటం మంచిదని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడుసమీక్షిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -