Friday, April 26, 2024
- Advertisement -

రాజ్యసభలో వ్యూహాత్మకంగా ట్రిపుల్ తలాఖ్ బిల్లును నెగ్గించుకున్న భాజాపా…

- Advertisement -

ట్రిపుల్ తలాఖ్ రద్దుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో ఎట్టకేలకు భాజాపా వ్యూహాత్మకంగా నెగ్గించుకుంది. ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై రాజ్యసభలో ఈ సాయంత్రం ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు లభించాయి. పలువురు సభ్యులు సభకు గైర్హాజరు కావడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ అనూహ్యంగా తగ్గింది. జేపీ సొంత సభ్యులు ఉండగా.. మిత్రపక్షాల మద్దతుతో బిల్లుకు ఆమోదం లభించింది.

సభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా, ఆమోదానికి 121 ఓట్లు కావాలి. అయితే, పలు పార్టీలు బిల్లును వ్యతిరేకించగా, మరికొన్ని పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దాంతో అందుబాటులో ఉన్న సభ్యులతో ఓటింగ్ నిర్వహించారు.స భ్యులందరికి స్లిప్పులు పంచి రహస్య ఓటింగ్‌ పద్దతిలో బిల్లుపై సభ్యుల అభిప్రాయం తీసుకున్నారు. అనంతరం మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని సభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభిస్తే దేశంలో ట్రిపుల్ తలాఖ్ రద్దు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -