Saturday, April 27, 2024
- Advertisement -

కాంగ్రెస్ నేత‌ల‌ స‌స్పెండ్ …కోమ‌టిరెడ్డి, సంప‌త్‌ల శాస‌న‌స‌భ్య‌త్వాల ర‌ద్దు

- Advertisement -

బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో రచ్చకుదిగిన కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. కోమటి రెడ్డి ఘటన వ్యవహారంలో 11 మంది కాంగ్రెస్ శాసన సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సభా మర్యాదలను మంటగలుపుతూ, పోడియంవైపునకు హెడ్‌సెట్‌ విసిరేయడం క్షమించరాని ఘటనగా స్పీకర్‌ పేర్కొన్నారు.

గవర్నర్ ప్రసంగం సమయంలో కోమటి రెడ్డి విసిరిన హెడ్‌ఫోన్ చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తాక‌డంతో గాయం అయిన సంగ‌తి తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి ఆటకం కలిగిస్తూ.. నినాదాలు చేసిన డీకే అరుణ, జానా రెడ్డి, పద్మావతి, రామ్మోహన్ రెడ్డి, మాధవ్, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి, గీతా రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, చిన్నారెడ్డిలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసన సభ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.

అటు మండ‌లిలోనూ మండలిలోనూ కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. షబ్బీర్ అలీ, పొంగులేటి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను మండలి నుంచి సస్పెండ్ చేశారు. చైర్మన్ స్థానంలో నేతి విద్యాసాగర రావు బాధ్యతలు చేప్టటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -