Friday, April 26, 2024
- Advertisement -

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కన్నుమూత…

- Advertisement -

తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్యంరెడ్డి స్వస్థలం సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్. తొగుట సర్పంచ్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.

1989లో దొమ్మాట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మరోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ముత్యంరెడ్డి, 2014లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.

ముత్యంరెడ్డి మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర టీఆర్ఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధికారులను ఆదేశించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -