Friday, April 26, 2024
- Advertisement -

ముస్లిం సోద‌రుల‌కు యూపీ పోలీసుల వార్నింగ్‌..

- Advertisement -

యూపీ పోలీసుల నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో న‌మాజ్ చేయ‌వ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేయ‌డం వివాదంగా మారుతోంది. నోయిడా సెక్టార్-58లో శుక్రవారం రోజున బహిరంగ ప్రదేశాల్లో ముస్లీంలు నమాజ్ చేయడానికి వీల్లేదని యూపీ పోలీసులు ఆదేశించారు.

ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు పార్కుల్లో నమాజ్ చేయరాదని, ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిబంధనల ఉల్లంఘనకు సంబంధింత సంస్థలే బాధ్యతవహించాల్సి ఉంటుందని నోయిడాలోని ఇండస్ట్రియన్ పార్క్‌లోని సంస్థలకు పంపిన నోటీసుల్లో పోలీసులు తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో ముస్లీం సోదరులు నమాజ్ నిర్వహించకూడదంటూ పోలీసు నోటీసులు వివాదాస్పదంగా మారుతున్నాయి.కోర్టుకు వెళ్లేందుకు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అయితే, తమ ఆదేశాలకు మతం రంగు పులమవద్దని పోలీసులు స్పష్టం చేశారు.

అయితే పోలీస‌లు మాత్రం ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించుకుంటున్నారు. త్వ‌ర‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో మ‌త సామ‌ర‌స్యాన్ని కాపాడేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -