Friday, April 26, 2024
- Advertisement -

వైసీపీపై అభిమానం ఏ స్థాయిలో ఉందో తెలుసా?

- Advertisement -

అధికారంతోపాటు వైసీపీపై అభిమానం కూడా పెరిగిపోతోంది. అందుకే అధికార వైసీపీ పార్టీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి వచ్చిన విరాళాలు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే… పార్టీకి విధేయులుగా నడుచుకునే వారు.. పార్టీ సానుభూతి పరులు నుంచి వచ్చిన విరాళాలు మాత్రమేనట..

అధికారంలోకి వచ్చే పార్టీకి విరాళాలు పంపి స్వామి కార్యం… స్వకార్యం చేసుకుంటారు కొందరు… అలానే వైసీపీకి ఈసారి విరాళాలు వచ్చిపడ్డాయి. అ పార్టీ నేత విజయసాయిరెడ్డి 2018-19 సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం 80 కోట్ల రూపాయలు వైసీపీకి విరాళాలు వచ్చాయని ఆయన సమర్పించిన లెక్కలే చెబుతున్నాయి. వైసీపీకి విరాళాలు వెల్లువలా వస్తున్నా…తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది… జనసేన ఊసే లేకుండా పోయింది…

తెలుగు రాష్టాల్లో రాజకీయాలు చాలా ఖరీదై పోతున్నాయి.. నిన్నటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ రోజు అధికారం కోల్పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1995 నుంచి 2003 వరకు అధికారంలో ఉన్న తెలుగదేశం పార్టీకి ఎంత మొత్తంలో విరాళాలు అందాయో ఉహించుకోవచ్ఛు. 1995 అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి వ్యాపారులు, బడా పారిశ్రామిక వేత్తలు భారీగా విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి విరాళాలకు కొదువేముంటుంది. వ్యాపారులను, పారిశ్రామిక వేత్తలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు ఆరితేరిపోయారన్న విమర్శలున్నాయి.

వైసీపీకి కూడా ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. విశాఖపట్నం ఎంపీ, పార్టీనేత నేత ఎంవీవీ సత్యనారాయణ 11 కోట్లు, జగన్ కంపెనీల నుంచి 1.75 కోట్లు, ఇతర కంపెనీల నుంచి 1.50, కోట్లు విరాళాలు వచ్చాయి.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అపుడు వైసీపీ వ్యతిరేకించిన కొన్ని పరిశ్రమలు ఇపుడు విరాళాలు ఇవ్వడం కొసమెరుపు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -