Friday, April 26, 2024
- Advertisement -

మోడీ సంచలన నిర్ణయం.. ఇక పై జంతువులకు ఆధార్..!!

- Advertisement -

మాములుగా అయితే ఆధార్ కార్డు అంటే మనుషులకు ఉంటుంది.. ఈ ఆధార్ లేకపోతే అసలు భారతీయుడు కాదని అనేవాళ్ళు ఉన్నారు.. ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి మనిషికి తప్పని సరి అయిపొయింది.. అయితే మోడీ ప్రభుత్వం గేదెలకు, ఆవులకు ఆధార్ కార్డు కూడా ముఖ్యమంటూ ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆవులు, గేదెలు వంటి పశువులకు కూడా ఆధార్ కార్డులు జారీ చేస్తోంది. అసలు వీటికి ఎందుకు ఆధార్ కార్డులు అనే అనుమానం వస్తుంది. దీని వల్ల ఉపయోగమేంటి అనికూడా అనుకోవచ్చు..

ఆవులు, గేదెలకు ఆధార్ నెంబర్ ఇస్తే.. ఈ నెంబర్‌ సాయంతో ఆ ఆవు, గేదే ఏ జాతికి చెందింది? దారి బ్రీడ్ ఏంటి? దాని ఆరోగ్యం ఎలా ఉంది? అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది,? ఆ పశువుకు సంబంధించిన యజమని ఎవరు? ఆ యా పశువులకు ఏమైనా వ్యాక్సిన్లు వాడుతున్నారా? వంటి పలు కీలక అంశాలపై స్పష్టత వస్తుంది. తద్వారా వాటి ఆరోగ్య పరిరక్షణతో పాటు పలు ఉపయోగాలు పొందవచ్చు. అంతేకాదు..దేశంలో పశు సంపద ఎంత ఉంది? పాడిపరిశ్రమపై ఆయా రైతులు ఆదాయం పొందుతున్నారా? వంటి పూర్తి సమచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మోదీ సర్కార్ ఇటీవలనే ఇగోపాల యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో కూడా పశు ఆధార్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అంటే మీరు ఇంట్లో కూర్చొని మీ గేదెలు లేదా ఆవుల వివరాలు తెలుసుకోవచ్చన్నమాట.

అంతేకాదు..దేశంలో పశు సంపద ఎంత ఉంది? పాడిపరిశ్రమపై ఆయా రైతులు ఆదాయం పొందుతున్నారా? వంటి పూర్తి సమచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మోదీ సర్కార్ ఇటీవలనే ఇగోపాల యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో కూడా పశు ఆధార్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అంటే మీరు ఇంట్లో కూర్చొని మీ గేదెలు లేదా ఆవుల వివరాలు తెలుసుకోవచ్చన్నమాట. అలా జరగాలంటే ఆవు లేదా గేదె పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలి. దీని కోసం ఆవు, గేదె ఆధార్ నెంబర్ ఉంటే వాటిని సంబంధించిన పూర్తి వివరాలు కొనుగోలుదారులకు కూడా లభిస్తాయి. ఇంకా యాప్ ద్వారా పశువులకు వ్యాక్సిన్ సదుపాయం పొందొచ్చు. అందుకే గేదెలకు..ఆవులకు కూడా ఆధార్ కార్డులు అవసరమంటోంది ప్రధాని మోడీ ప్రభుత్వం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -