Friday, April 26, 2024
- Advertisement -

టీడీపీ భవిష్యత్ పై చంద్రబాబు సంచలన నిర్ణయం…?

- Advertisement -

టీడీపీ మాజీ మంత్రి, కీలక సభ్యుడు, చంద్రబాబు బంటు కుడి భుజం అయిన అచ్చెం నాయుడు చాలారోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయిన సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ లో కలవరం సృష్టించిన ఈ ఎస్ ఐ స్కాం లో ప్రధాన నిందితుడిగా భావించి అచ్చెన్న ను పోలీసులు అరెస్ట్ చేయగా పలుమార్లు బైలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.. ఎట్టకేలకు ఇటీవలే నిభంధనలతో కూడిన బెయిల్ ని ఇవ్వగా అచ్చెన్న చాల అనారోగ్యం తో ఉన్నారని తెలుస్తుంది.. అరెస్ట్ అయిన నాటినుంచి అయన జైల్లో కంటే హాస్పిటల్ లోనే ఎక్కువ గడిపింది.. దాదాపు రెండున్నర నెలలు హాస్పిటల్లో గడిపిన ఆయన అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారు..కరోనా వచ్చిందన్న వార్తలు ఆయనపై చాల వైరల్ అయ్యాయి..  టెక్కలి ఎమ్మెల్యే గా వరుసగా గెలుస్తున్న కింజరాపు అచ్చెం నాయుడు కి అక్కడ ప్రజల మద్దతు బాగానే ఉన్నా స్కాం చేసి అవినీతి కి పాల్పడ్డాడని అపవాదు అయితే ఉంది..

ఇక జైలునుంచి వచ్చిన అచ్చెం నాయుడు కి చంద్రబాబు ఓ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొదటినుంచి పార్టీ కోసం కష్టపడి జగన్ కక్ష్య సాధింపు చర్య తో జైలు కి పంపినా తొణకకుండా ఉండి పార్టీ పరువును కాపాడిన అచ్చెన్న ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట.. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన తర్వాత టీడీపీ పార్టీ ని చాలామంది నమ్మకస్థులు గాలికి వదిలేశారు..కష్ట సమయాల్లో పార్టీ ని ఆదుకుంటారని ఎంతో మంది మీద ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ని అందరు మోసం చేసి ఇప్పుడు ఎలాంటి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఒంటరిని చేశారు.. అయితే అచ్చెన్న మాత్రం పార్టీ ఓడిపోయినా నాటినుండి చంద్రబాబు కు, పార్టీ అండగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు.. ఒకవిధంగా అచ్చెన్న ను అధికార పార్టీ టార్గెట్ చేసినా చంద్రబాబు వైపు నిలబడడం తో చంద్రబాబు కి అచ్చెన్నా గతంలోకంటే ఇప్పుడు బాగా నచ్చేశారట..

దాంతో ఇప్పటికే అధ్యక్ష పదవిలో ఉన్న కళావెంకట్రావు ని తప్పించి టీడీపీ రాష్ట్ర కిరీటాన్ని అచ్చెన్నకు తొడగనున్నారట.. కళావెంకట్రావు ఎన్నికల తర్వాత దూకుడు గా  లేకపోవడంతో అన్ని జిల్లాల్లో పార్టీ వీక్ గా ఉందని చంద్రబాబు కి అనిపిస్తుండగా అన్ని జిల్లాల్లో పేరున్న, సమర్ధవంతమైన నాయకుడిని అధ్యక్షుడు గా చేస్తే వచ్చే ఎన్నికలనాటికి పార్టీ బలపడుతుందని చంద్రబాబు ఆలోచన.. అయితే లోకేష్ బాబు ఉండగా బయటవాళ్ళకి ఈ పదవిని కట్టబెట్టం ఎందుకు అని అందరికి డౌట్ రావచ్చు.. కానీ లోకేష్ రాజకీయం గురించి అందరికి తెలిసిందే.. ఒకవేళ కొడుకును అధ్యక్షుడిని చేసినా తనకే ప్రమాదమని వెనుకడుగువేశారట.. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి పదవికి కొత్తవారిని ఎంపిక చేయాలి కానీ కరోనా వల్ల లేట్ అయ్యింది. ఇప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలించడంతో త్వరలో ఈ కార్యక్రమం పూర్తి చేయనున్నారట.. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు టీడీపీ మంచి రోజులు తీసుకొస్తాడా అన్నది చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -