చంద్రబాబుకు కొడాలి నాని ఊహించని సవాల్..!

644
ap Minister Kodali Nani Challenges Chandrababu On Three Capitals
ap Minister Kodali Nani Challenges Chandrababu On Three Capitals

ఏపీ మంత్రి కొడాలి నాని.. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు గట్టి సవాల్ విసిరారు. బాబుకు ధైర్యం, దమ్ము గనుక ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు అందరితో రాజీనామాలు చేయించి.. ఉప ఎన్నికలకు రెడీ అవ్వాలని అన్నారు. టీడీపీ గనుక ఉప ఎన్నికల్లో 20కి 20 సీట్లు గెలిచినట్లు అయితే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన ఖచ్చితంగా చేసే అవకాశం ఉందని అన్నారు. ఒక వేళ ఉప ఎన్నికల్లో బాబు ఓడిపోతే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంకు సపోర్ట్ ఇవ్వాలని అన్నారు.

ప్రజలు, ముఖ్యమంత్రి కోరిక మేరకు తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఓకే చెప్పారని.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నదే తమ లక్షమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకే చోట లక్ష కోట్లు వ్యయంతో మహా నగరం నిర్మించడం సాధ్యం కాదని.. అమరావతి రాజధాని నిర్మించడానికి అయ్యే ఖర్చులో 10 శాతం విశాఖపట్నంలో పెడితే మహా నగరాలకు ధీటుగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని అన్నారు.

గత ఎన్నికల్లో ఓడిపోయినా టీడీపీకి బుద్ధి రాలేదని.. సిగ్గులేకుండా జూమ్‌ యాప్‌లో పిచ్చి కూతులు కూస్తున్నారని.. రాయలసీమ జిల్లాల్లో 52 సీట్లు ఉంటే చంద్రబాబు, బాలయ్యలను మాత్రమే గెలిపించారని నాని గుర్తు చేశారు. అక్కడ ప్రజలు టీడీపీని చీదరిచుకున్న వీరికి బుద్ది రాలేదని.. టీడీపీకి కంచుకోట ఉత్తరాంధ్రలోనూ ప్రజలు బాబుకు సరైన బుద్ది చెప్పారని.. కృష్ణా, గుంటూరు ప్రజలు కూడా ఆయన చేసిన మోసం గ్రహించి లోకేష్‌ను దారుణంగా ఓడించారని అన్నారు.

వైవీ సుబ్బారెడ్డిని తప్పించడం వెనుక కారణమేంటి?

ఆరు జూమ్ లు… అరవై పీసీలు… ఇదే టీడీపీ

ఆ మంత్రులందరికీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్..?

చంద్రబాబు నమ్మక ద్రోహి : ఒమర్ అబ్దుల్లా

Loading...