Friday, April 26, 2024
- Advertisement -

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

- Advertisement -

టీడీపీ పరిస్థితి ఇప్పుడెలా తయారైంది అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది.. ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా దాడి చేస్తుందో తెలియని పరిస్థితి.. ఇప్పటికే టీడీపీ నేతలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు.. వైసీపీ ఆపరేషన్ అవినీతి లో ఇప్పటికే పలువురి టీడీపీ నేతలను జైలు కి పంపింది. దాంతో ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమను జైలుకి పంపిస్తారన్న భయం టీడీపీ నేతల్లో నెలకొంది.. ఓ వైపు చంద్రబాబు మొత్తుకున్నా నేతలు మాత్రం బయటకి వచ్చే సాహసం చేయలేకపోతున్నారు..

మరోవైపు పార్టీ ఉనికి ని కాపాడాలని చినబాబు, పెదబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వైసీపీ పార్టీ పైకెళుతుంటే టీడీపీ మాత్రం రెండు మెట్లు కిందకు దిగజారిపోతోంది. ఇప్పటికే ప్రజలు మరో ముప్పై ఏళ్ళు టీడీపీ ని నమ్మే పరిస్థితి లేదని అర్థమైపోయింది.. దాంతో చంద్రబాబు తన టైం అయిపోయే లోపు కొడుకు లోకేష్ ని రాజకీయంగా బలవంతుడిని చేయాలనీ ప్రయత్నిస్తున్నారు.. ఎంత చేసినా కుక్క తోక వంకరగా ఉండక మానుతుందా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు..

ఇక చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు కూడా ఇప్పుడు ఆ పార్టీ కి తలనొప్పులుగా మారుతున్నాయి.. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం.. 15 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా పాల‌నా అనుభ‌వం ఉన్న నేత ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న పార్టీ ఇప్పుడు కేవ‌లం ఉనికి కోస‌మే కొన్ని కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. కాషాయిరంగు పులుముకున్న ప‌సుపు ద‌ళం ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డం.. ఒక్కో నేత పార్టీ నుంచి జారుకుంటుండ‌డంతో ఎలాగైనా టీడీపీని నిల‌బెట్టుకోవాల‌నే త‌ప‌న ఆ పార్టీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. అందుకు కొత్త కొత్త దారుల‌ను వెదుకుతోంది. దానిలో భాగంగా ఇప్పుడు రాష్ట్రంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై క‌మిటీల రాజ‌కీయానికి తెర‌తీసింది. ఈ కమిటీ రాజకీయాలతో చంద్రబాబు ఏం వెలగబెడమని అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు..

రాష్ట్రానికి చంద్రబాబు ఇప్పుడొచ్చి ఏం చేద్దామని..?

ఈ టీడీపీ లీడర్లు మౌనంగా ఉండడం ఏంటి..?

జగన్ ఇలా ప్లాన్ చేస్తే టీడీపీ ఏపీ లో ఉండదు..?

చంద్రబాబు ఈ పిచ్చి నమ్మకానికి కారణం ఇదేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -