Saturday, April 27, 2024
- Advertisement -

మ‌డ‌కసిర టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్ల‌ద‌న్న హైకోర్టు

- Advertisement -

టీడీపీకీ కాలం క‌ల‌సి రావ‌ట్లేదు. ఒక వైపు పార్టీనుంచి నేతలు బ‌య‌ట‌కు వెల్లిపోతుంటే తాజాగా మ‌రో బిగ్ షాక్ త‌గిలింది.2014 ఎన్నిక‌ల్లో మ‌డ‌క శిర టీడీపీ ఎమ్మెల్యే వీర‌న్న‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయ‌న ఎన్నిక‌ల చెల్ల‌ద‌ని హైకోర్టు సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించింది.

2014 ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లా మ‌డ‌క‌శిర నియోజ‌క వ‌ర్గంనుంచి టీడీపీ త‌రుపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైసీపీ అభ్య‌ర్తి తిప్పేస్వామిపై గెలుపొందారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో త‌ప్ప‌డు స‌మాచారం ఇచ్చార‌ని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు తిప్పేస్వామి.

కర్ణాటకలో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్‌లో వీరన్న తెలియజేయలేదని, ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు . ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వీరన్న ఎన్నిక చెల్లదన్న హైకోర్టు.. తదుపరి ఎన్నికలు జరిగేవరకు డాక్టర్‌ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగవచ్చునని ఆదేశాలు ఇచ్చింది.

మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు నమోదవ్వగా.. అందులో ఒక కేసులో చార్జిషీట్ దాఖలైంది. ఈరన్న భార్య కర్ణాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న విష‌యాన్ని అఫిడ‌విట్‌లో పేర్కొన‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -