Saturday, April 20, 2024
- Advertisement -

టీడీపీకి ఊహించని షాక్.. వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే..!

- Advertisement -

టీడీపీకి మరో షాక్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాళి గిరి టీడీపీ వీడాలని.. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉండటంతో.. గిరి సైతం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని తరహాలో టీడీపీకి బై చెప్పి వైసీపీకి జై కొట్టే ఛాన్స్ కనిపిస్తోంది. వైసీపీలోకి మద్దాళి గిరిని తీసుకొచ్చేందుకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యపాత్ర పోషించారు.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే గతంలో సీఎం జగన్ ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా.. ముందుగా తమ పార్టీకి.. పార్టీ ద్వారా వచ్చిన పదివికి రాజీనామా చేసి రావాల్సిందేనని చెప్పారు. దాంతో ఎమ్మెల్యే వంశీ పార్టీకి మాత్రమే రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే తరహాలో ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు వైసీపీ చూస్తుంది.

ఇందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యే మద్దాళి గిరి పార్టీ వీడి వైసీపీకి మద్దతుగా నిలవాలని చూస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు గుంటూరు పర్యటనకు వచ్చారు. అయితే ఈ కార్యక్రమంకు మద్దాళి గిరి హాజర్ కాలేదు. ఇక మంత్రి వెల్లంపల్లి శ్రీనీవాస్ మద్దాళి గిరిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఒప్పించారు. ఈ విషయంపైన సీఎంతో కూడా మాట్లాడి ఒప్పించారు.

అమరావతి నుంచి రాజధాని తరలింపు విషయంలో రైతులను టీడీపీ రెచ్చగొడుతుందని భావిచిన వైసీపీ.. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుంటే టీడీపీ వాదనను ఆ పార్టీ నేతలే వ్యతిరికేస్తారని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరి దీనీపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -