విజయసాయిరెడ్డికి గంటా ఇలా షాక్ ఇవ్వనున్నాడా ?

- Advertisement -

గంటా శ్రీనివాసరావు.. 2004 లో చోడవరం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం దక్కించుకున్న తర్వాత 2009లో బాబుని కాదని చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో గంటా మంత్రిగా పని చేశారు. 2014 లో మళ్లీ టీడీపీలోకి వచ్చి.. భీమిలి నియోజక వర్గం నుండి గెలిచిన గంటా.. మంత్రి కూడా అయ్యారు. అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేస్తారు గంటా.

అయితే సొంత పార్టీ నేతలతోనే ఆయనకు విభేదాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంటా అరెస్ట్ పై చాలా కథనాలు వచ్చాయి. స్కూల్ పిల్లలసైకిళ్ళ పంపిణీ పథకంలో గంటా అవినీతికి పాల్పడ్డారని, ఆయన అరెస్టుకు రంగం సిద్ధం అవుతుందని వార్తలు రావడం జరిగింది. గంటా అరెస్ట్ తప్పదంటూ విజయసాయి రెడ్డి పరోక్షంగా ట్వీట్స్ కూడా చేశారు. అయితే వైసీపీలో చేరేందుకు గంటా పావులు కదుపుతున్నారనే ప్రచారం కొంత కాలంగా వినిపిస్తోంది. ఐతే గంటా వైసీపీ ఎంట్రీకి సర్వం సిద్ధం అని తెలుస్తుంది. దీనిపై జగన్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డికి కరోనా వైరస్ సోకడం వలన, ఆయన కొరెంటైన్ లో ఉంటూ రాజకీయాలకు స్వల్ప విరామం ప్రకటించారు.

- Advertisement -

విజయసాయిరెడ్డి రిలాక్స్ అవడంతో గంటాకు ఎంట్రీ సులభం అంటున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మరియు విజయ సాయి రెడ్డి గంటా శ్రీనివాస్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . ముఖ్యంగా అవంతి శ్రీనివాస్, గంటా చేరికతో విశాఖలో తన అధిపత్యానికి గండిపడే అవకాశం కలదని భావిస్తున్నారు. వీరిద్దరికి ఇష్టం లేకపోవడం వలనే గంటా శ్రీనివాస్ వైసీపీలోకి రావడం కష్టం అవుతుందట. మరి గంటా వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం లాంఛనమే అని తెలుస్తుండగా, దీనిపై కొద్దిరోజులలో అధికారిక ప్రకటన రానుందట. విజయసాయి రెడ్డి విరామం గంటా ఎంట్రీకి సరైన సమయం అని అంటున్నారు.

విజయసాయి రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా విషయంలో జగన్ షాకింగ్ నిర్ణయం..!

జగన్ మా మాట వినరు.. చెప్పుడు మాటలు వింటారు : రఘు రామకృష్ణరాజు

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించండి : ప్రభుత్వానికి రాఘురామకృష్ణరాజు సూచన..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -