Saturday, April 27, 2024
- Advertisement -

టీఆర్ఎస్ లో ఆ ఇద్దరికీ హుజూర్ నగర్ డూ ఆర్ డై

- Advertisement -

ఎన్నికలంటే ఆ టెన్షన్ అధికార పార్టీపై మరింతగా ఉంటుంది. అధికారంలో ఉండడంతో అది ఇజ్జత్ కా సవాల్ గా మారుతుంది. ఇప్పుడు హుజుర్ నగర్ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ కు అలాంటి పరిస్థితినే తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఎన్నికల భారం ఆ ఇద్దరు నాయకుల పైనే పడిందట. ఆ ఇద్దరు నాయకులు నిద్రాహారాలు మాని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. వారి రాజకీయ భవిష్యత్ మార్చే ఎన్నికలు కావడంతో తెగ తిరుగుతున్నారట..

హుజుర్ నగర్ ఉపఎన్నిక ఉత్కంఠ గా మారింది. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఫైట్ నడుస్తోంది. హుజూర్ నగర్ బాధ్యతలు చేపట్టిన గులాబీ దళంలోని ఇద్దరు నేతలకు మాత్రం తెగ టెన్షన్ పట్టుకుంది. ఒకరు ఎలక్షన్ ఇన్ చార్జీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాగా.. మరొకరు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఉప ఎన్నిక గెలిస్తేనే వీళ్ల పదవులకు గ్యారెంటీ అట.. తేడా వస్తే మాత్రం ఒకరికి ప్రమోషన్ మిస్ కావడంతోపాటు.. ఇంకొకరికి డిమోషన్ తప్పదన్న చర్చ గులాబీపార్టీలో సాగుతోంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న పల్లా రాజేశ్వర్ నామినేటేడ్ పదవి రేసులో ఉన్నారు. హుజుర్ నగర్ ఉపఎన్నిక అవగానే పల్లాకు కీలక పదవులను కట్టబెట్టే అలోచనలో ఉన్నారట సీఎం కేసీఆర్. దీంతో పల్లాకు ఈ ఎన్నిక చాలా ముఖ్యమైంది. ఎలాగైనా సరే ఉప ఎన్నిక గెలిచి తీరాలి అన్న కసితో ఆయన ఉన్నారు.

ఇక మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి కూడా ఈ ఎన్నిక కీలకం. హుజుర్ నగర్ లో టీఆర్ ఎస్ ఎప్పుడు గెలవాలేదు. స్వయనా జగదీశ్ రెడ్డి కూడా పోటి చేసి ఓడి పోయారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ గెలిచి తీరాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. తేడా వస్తే మంత్రి పదవికి గండం అని టెన్షన్ లో ఉన్నారట.దీంతో ఆయన ఆంతా తానై చూస్తున్నారట. సైదీరెడ్డి తరుపున గ్రామగ్రామాన తిరుగుతున్నారు. అధినేతల ప్రచారం లేదు.. బహిరంగ సభలు లేవు అయినా ఎన్నిక గెలవాలి దీంతో ఈ ఇద్దరు నేతలకూ టెన్షన్ పట్టుకుంది. హుజుర్ నగర్ ఉపఎన్నిక ప్రచారానికి శనివారం తో తెరపడుతుంది. ఇప్పటి వరకు కేటీఆర్ మాత్రమే ప్రచారం నిర్వహించారు. రోడ్ షో తో సరిపెట్టారు.

సీఎం ప్రచార సభ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీంతో ప్రచారభారం అంతా ఇద్దరు నాయకులపైనే పడింది. ఓవైపు కాంగ్రెస్ నాయకులంతా మోహరించారు.కానీ టీఆర్ఎస్ తరుపున మాత్రం నల్లగొండ ,మహబుబ్ నగర్ నేతలు ఫీల్డ్ లో ఉన్నారు సమయం తక్కువగా ఉండడం అదినాయకత్వం ప్రచారం చేయకపోవడం టీఆర్ఎస్ కు మైనస్ గా మారింది. దీంతో ఇద్దరి నాయకులు ప్రచారా భారాన్ని కార్యకర్తల సమన్వయాన్ని చేస్తూ ఇతర వ్వవహారాలను చక్కపెట్టుకుంటున్నారు. ఎన్నిక ఏమాత్రం తేడాకొట్టినా వీళ్ల ఇద్దరీదే కీ రోల్ కాబట్టి తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -