Saturday, April 27, 2024
- Advertisement -

ఆలయం రథం దగ్ధం పై సీఎం జగన్ సీరియస్.. సిబిఐ విచారణకు ఆదేశం..?

- Advertisement -

రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లు ఇప్పుడు ఆలయ రధం దగ్ధమైన విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టింస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.

సుమారు 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథం మంటల బారిన పడటం స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు. దీనిపై అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధంపై మంత్రి వెల్లంపల్లి దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దేవాదాయ కమిషనర్, జిల్లా ఎస్పీతో మంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఘటన ప్రమాదవశావత్తు చోటు చేసుకుందా? లేక ఉద్దేశపూరకంగా గుర్తు తెలియని వ్యక్తలు ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారా? అనేది తమ విచారణలో తేలుతుందని అన్నారు. ఆరు దశాబ్దాల కిందట ఈ రథాన్ని తయారు చేశారని, ఇప్పుడిలా మంటల్లో కాలిపోవడం అపశకునం అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణ అధికారిగా.. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ రథం పునర్నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -