వైసీపీలో చేరుతా.. కానీ ఆ పని చేయాలి : జేసీ సంచలన వ్యాఖ్యలు

1506
jc Prabhakar Reddy Interesting Comments On Amaravati And Three Capitals Issue
jc Prabhakar Reddy Interesting Comments On Amaravati And Three Capitals Issue

తమపై రాజకీయ వేధింపుల్లో భాగంగానే అక్రమంగా కేసులు పెట్టారని జేసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. తమ ట్రావెల్స్ వాహనాలకు సంబంధించి అన్ని నిబంధనలు పాటించినప్పటికి తమపై కావాలనే కేసులు బనాయించారని అన్నారు. తాము జైల్లో ఉన్న అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమపై నిఘా పెట్టి.. చాలా కుట్రలు చేశారని ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

జైలు అధికార్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని తెలియజేశారు. కరోనా ఉన్న టైంలో జైల్లో ఉంచడం తప్పని.. ఇబ్బందులు పెట్టాలని చూసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. ఇక మూడు రాజధానుల అంశంపై.. అలానే రాష్టంలో ప్రస్తుత పరిస్తితులపై జేసీ స్పందించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరడానికి తాను సిద్ధమే అని తెలిపారు. పార్టీ మారతారనే ప్రచారంను ఆయన కొట్టిపారేశారు.

తాము టీడీపీలోనే ఉంటామని.. అవసరమైతే రాజకీయాలు నుంచి పూర్తిగా తప్పుకోవడానికి రెడీ.. కానీ టీడీపీ ని వదిలే ప్రసక్తి లేదని తెలిపారు. తాము జైలు నుంచి వచ్చిన సందర్భంలో తాడిపత్రి ప్రజల్లో నూతనోత్సాహం చూశానని.. గతంలో ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రాని మహిళలు సైతం బయటకు వచ్చి హారతలు ఇచ్చరని తెలిపారు.

జగన్ సర్కార్ కొత్త నిర్ణయం.. కరోనా రోగి వద్ద కాలింగ్‌ బెల్‌.. !

జగన్ హ్యాపీ ఫీల్ అయ్యే విషయం చెప్పిన చిరు, సురేష్ బాబు..!

రాజధాని అంశంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. జగన్ కు గుడ్ న్యూస్..!

జగన్ కొట్టి మాట్లాడతారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీ..!

Loading...