Saturday, April 27, 2024
- Advertisement -

లోకేశ్ కు కూడా తండ్రి బుద్ధులొచ్చాయన్న కేటీఆర్..

- Advertisement -

ఏపీలో సంచలనం​ సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్‌ స్కాం రెండు రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయ రంగు పులుముకొంటోంది. ఐదుకోట్ల మంది ఆంధ్రుల డేటా ఐటీ గ్రిడ్ కంపెనీ ద‌గ్గ‌ర‌కు ఎలా వ‌చ్చింద‌నే ద‌నే విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. డేటా స‌మాచారాన్ని దొంగిలించార‌న్న ఫిర్యాదుపై తెలంగాణా పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇందంతా టీ ప్ర‌భుత్వ‌మే చేయిస్తోంద‌ని బాబు, లోకేష్‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

టీడీపీ సేవామిత్ర యాప్‌తో ఏపీ ప్రజల డేటాను దొంగిలించినట్లు హైదరాబాద్‌లో కేసు నమోదు కావడం వల్లనే ఇక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఏత‌ప్పు చేయ‌క‌పోతే ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నించారు. అడ్డంగా దొరికిపోయి రంకెలేయడం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు అలవాటే. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్ అనే సంస్థ దొంగిలిస్తోందని ఏపీకి చెందిన ఓ వ్యక్తి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడ‌ని అందుకే తెలంగాణా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకలేదా? అని ప్రశ్నించిన కేటీఆర్, ఏపీకి చెందిన వ్యక్తి తెలంగాణలో ఫిర్యాదు చేసినా, ముంబైలో ఫిర్యాదు చేసినా, ఫిర్యాదు చేసిన చోటనే కేసు నమోదవుతుందన్న కనీస ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేకపోయిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఏపీ పోలీసులుకు ఏం పనిఅని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారని, ఏం తప్పుచేయని చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని అన్నారు.

దొంగకు నోరెక్కువ అన్నట్లుగా చంద్రబాబు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇంతటి దుర్మార్గమైన, అరాచకమైన ప్రభుత్వం ఉండాల్సివ అవసరం ఉందా? అన్నది ఏపీ ప్రజలు ఆలోచించుకోవాల‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -