టీడీపీ భవిష్యత్తు లేదు.. జూ ఎన్టీఆర్ లాభం లేదు : కొడాలి నాని

807
Minister Kodali Nani Interesting Comments On Tdp Future
Minister Kodali Nani Interesting Comments On Tdp Future

ఇక ఏపీలో టీడీపీ మళ్లీ పుంజుకునే ఛాన్స్ లేదని అంటున్నారు మంత్రి కొడాలి నాని. టీడీపీకి ఎక్స్‌పైరీ డేట్ ముగిసిందని.. ఇప్పుడు ఎవరు వచ్చిన టీడీపీని కాపాడలేరని అన్నారు. తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఏపీలో సరైన పోటీ ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు. ఎవ్వరొచ్చినా టీడీపీకి మాత్రం భవిష్యత్తు లేదన్నారు.

ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు హ‌రికృష్ణ‌, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ముందకు సాగామన్నారు నాని. కానీ 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయిన త‌ర్వాత హ‌రికృష్ణ‌ను ప‌క్క‌న‌బెట్ట‌డం, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. టీడీపీలో ఉండటం కష్టమని భావించి.. వైసీపీలోకి వచ్చానని అన్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాత తన నియోజకవర్గానికి నిధులు కేటాయించారన్నారు.

గతంలో చంద్రబాబు ఎన్టీఆర్‌ను అవమానించిన తీరు తనను బాధించిందని.. తర్వాత జగన్‌ను కూడా అనేక రకాలుగా ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. ఇవన్ని చూసి టీడీపీలో ఉండలేకపోయానని అన్నారు. టీడీపీకి భవిష్యత్తు అసలు లేదని. జూ ఎన్టీఆర్ వచ్చి పార్టీకి లాభం లేదని అన్నారు. తాను వైసీపీలో చేరాక ప్రతిపక్షంలో కొనసాగామని.. తర్వాత పార్టీలో జగన్ తనకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అంతేకాకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి ఇచ్చరని.. తాను జీవితాంతం వైఎస్ జగన్ వెంటే నడుస్తానని చెప్పారు.

పవన్-బీజేపీ కలిసినా ఏం చేయాలేరు.. జగన్ దే ఎప్పుడైన గెలుపు : పోసాని

ఆగస్టు 16న రాజధాని శంకుస్థాపన ?

చంద్రబాబుకు జలక్ ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు..!

చంద్రబాబు ప్రెస్ మీట్ అంటే భయపడుతున్న టీడీపీ నేతలు..?

Loading...