Saturday, April 27, 2024
- Advertisement -

చంద్రబాబుకు బిగ్గెస్ట్ షాక్…….. వైకాపాలోకి సమైక్యాంధ్ర పోరాట హీరో

- Advertisement -

సమైక్యాంధ్ర పోరాటం హీరో అని చెప్పి చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ మొత్తం ఎవరి మొహం చూపించి ఓట్లు దండుకున్నారో…..ఇప్పుడు ఆ హీరో….ఆ తెదేపా ఎమ్మెల్యే వైకాపాలో చేరడం ఖాయం అయింది. ఆల్రెడీ రావెల కిషోర్‌లాంటి ఎమ్మెల్యే టిడిపిని వీడి జనసేనలో చేరుతూ టిడిపిలో దళితులను, దళిత నాయకులను ఎంత హీనంగా చూస్తున్నారో ఓపెన్‌గా చెప్పేశాడు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న బాబు మాటలతోనే టిడిపి వాళ్ళకు దళితులపై ఉన్న ప్రేమాభిమానాలు ఏపాటివో అందరికీ అర్థమయ్యాయి. తాజాగా దళిత నాయకులు, దళిత సంఘాల వారు టిడిపిని బహష్కరిస్తున్నాం అనే రేంజ్‌లో ప్రకటనలు ఇస్తూ ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

టిడిపి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే నారా వారి అవినీతి వ్యవహారాలు, అక్రమ వ్యవహారాలతో పాటు 2019 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే అవకాశమే లేదన్న నిజాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. అందుకే ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. అందరూ కూడా ముందుగా వైకాపావైపే చూస్తున్నప్పటికీ జగన్ మాత్రం కొన్ని విలువలకు లోబడి పార్టీలో చేర్చుకుంటున్నారు. అలా జగన్ కోరుకుంటున్న విలువలు ఉన్న నాయకుడు, పార్లమెంట్‌లో విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కాస్తైనా పోరాటం చూపించిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైకాపాలో చేరడం ఇప్పుడు ఖాయం అయింది. విభజన సమయంలో కూడా సిన్సియర్‌గా పోరాడిన వేణుగోపాల్‌రెడ్డికి నాయకుడిగా మంచి పేరు ఉంది. అందుకే ఈ టిడిపి ఎమ్మెల్యే వైకాపాలో చేరడానికి ఆసక్తి చూపించడంతో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వైకాపా తరపున ఎంపిగా పోటీ చేసే యోచనలో మోదుగుల ఉన్నాడు. గుంటూరు జిల్లాలో పార్టీని ఇంకా బలోపేతం చేయడం, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యతను తీసుకుంటానని జగన్‌కి మాట ఇచ్చాడట మోదుగుల. ఈ టిడిపి ఎమ్మెల్యే చేరిక నైతికంగాను వైకాపాకు ప్లస్ అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాల్లో జయాపజయాలను డిసైడ్ చేసే స్థాయి ప్రజాదరణ ఉన్న నాయకుడు కావడంతో ఈ చేరిక వైకాపాకు బిగ్గెస్ట్ బూస్ట్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -