Friday, April 26, 2024
- Advertisement -

భగ‌త్ సింగ్‌ను కించ‌ప‌రిచిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

- Advertisement -

న‌టుడు,జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లో ఇంకా రాజ‌కీయ ప‌రిజ్ఞానం క‌నిపించ‌డం లేదు. ఆవేశ‌పూరితంగా మాట్లాడ‌టం త‌ప్ప ప‌వ‌న్ ప‌వ‌న్ ఎలాంటి మార్పు లేదు. సీఎం సీఎం అని అరిపించుకున్న ,రాజకీయ నాయ‌కులు పంచెలు ఊడ‌గొడ‌తాన‌న్నా. వీసా స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డానికే అమెరికా వ‌చ్చాన‌ని అంటూ చెప్పిన మాట‌లు ప‌వ‌న్‌కే చెల్లుతుంది. ఏ రాజ‌కీయ పార్టీకి అయిన ఫండ్స్ మీద ఆధార‌ప‌డ‌టం స‌ర్వ‌సాధార‌ణం. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌,బీజేపీ పార్టీలు సైతం విదేశి ఫండ్స్ మీద ఆధార‌ప‌డ్డాయి అంటే ఒక్క‌సారి ఆలోచించుకోవాలి.

తాజాగా అమెరికా వెళ్లిన జ‌న‌సేనాని నేను ఇక్క‌డికి ఫండ్స్ అడ‌గ‌డానికి రాలేదు,మీ హెచ్ బి1 వీసా స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి వ‌చ్చాన‌ని చెప్ప‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యప‌రిచింది. వీసా స‌మ‌స్య అనేది రెండు దేశాల మ‌ధ్య ఉంటుంది. వీటిని ప‌రిష్క‌రించే అధికారం ఆ రెండు దేశాధినేత‌ల వ‌ల్లే అవుతుంది. ఇది కూడా తెలియ‌ని ప‌వ‌న్ ఎలా రాజ‌కీయ నాయ‌కుడు అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. ఫండ్స్ అడ‌గటానికి రాలేద‌ని చెబుతున్న ప‌వ‌న్‌,తెర వెనుక మాత్రం ఆ ప‌ని చెప‌ట్ట‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. కొంద‌రు జ‌న‌సైన ఎన్నారై కార్య‌క‌ర్త‌లు ఓ మీటింగ్ ఏర్పాటు చేసి మ‌రి ఫండ్స్ క‌లెక్ట్ చేయ‌డం క‌నిపించింది. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ఓ స్వాంతంత్ర‌ద్యోమ నాయ‌కుడు ఎలా చ‌నిపోయాడో కూడా ప‌వ‌న్‌కు తెలియ‌డం లేదు. స్వాంతంత్ర‌ద్యోమ కారుడైన భగత్‌ సింగ్ గురించి మాట్లాడుతు.. భగత్ సింగ్ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పుకొచ్చారు.

అయితే అలాంటి వ్యక్తి 23 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. భగత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకోలేదని, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్‌ వారిపై హింసాత్మక ఉద్యమం చేపట్టి వారి చేతిలో ఉరితీయబడ్డారని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఉరికొయ్యను ముద్దాడిన స్వాతంత్ర్య సమరయోధుడు అంటూ గుర్తు చేస్తున్నారు. ప‌వ‌న్ అవ‌గాహ‌న లేకుండా మాట్లాడితే పొలిటిక‌ల్ లీడ‌ర్ కాదు క‌దా క‌నీసం గ‌ల్లీ లీడ‌ర్ కూడా కాలేడ‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -