చంద్రబాబు నమ్మక ద్రోహి : ఒమర్ అబ్దుల్లా

1041
Omar Abdullah fires on Chandrababu
Omar Abdullah fires on Chandrababu

జమ్మూ కశ్మీర్ ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మండి పడ్డారు. చంద్రబాబును నమ్మి తన తండ్రి ఫారూఖ్ అబ్దుల్లా సొంత ఎన్నికలు వదులుకుని ఎన్నికల ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ వెళ్లారని, వైఎస్ జగన్ క్లీన్ స్వీప్ చేస్తారని తెలిసినా తన తండ్రి వెనక్కి తగ్గలేదని ఒమర్ అద్బుల్లా అన్నారు.

తాము కష్ట సమయంలో ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు పలకరించలేదని, బాబు తన అసలు రంగును బయటపెట్టారని…చంద్రబాబు అవకాశవాది అని ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.

జమ్మూ కశ్మీర్ క్రైసిస్ సమయంలో ఫారూఖ్, ఒమర్ అబ్దుల్లాలను పబ్లిక్‌ సేఫ్టీచట్టం కింద 8నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిన కనీసం తమకు ఒక్క ఫోన్ కూడా చేయలేదని ఒమర్ అబ్దుల్లా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

Loading...