Friday, April 26, 2024
- Advertisement -

చంద్రబాబుకు ఐటీ నోటీసులు రాబోతున్నాయా?

- Advertisement -

ఎన్నికల ముందు బీజేపీపై కత్తిగట్టి మోడీని గద్దెదించడమే ఎజెండా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసిన చంద్రబాబు ఇప్పుడు దారుణంగా ఓడిపోవడంతో కాళ్లబేరానికి వచ్చాడన్న విమర్శలున్నాయి. తన నలుగురు ఎంపీలను బీజేపీలోకి కమలనాథులను కూల్ చేసిన చంద్రబాబుపై తాత్కాలికంగా బీజేపీ పెద్దలు ప్రతీకారం తీర్చుకోకుండా ఆగారే తప్ప ఎల్లకాలం బాబును ఉపేక్షించడం లేదని తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. తాజాగా ఆపరేషన్ చంద్రబాబును ఢిల్లీలో మొదలు పెట్టినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

అందులో భాగంగా 2014 నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, తర్వాత చేసిన అవినీతి కుంభకోణాల పై ఓ ప్రత్యేక టీంతో సమీక్ష చేయిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోడీ,షా లకు మాత్రమే టచ్ లో ఉండే ఈ టీం సభ్యులు ఇచ్చిన ఆధారాలే సాక్ష్యంగా ఏపీలో జరిగిన అవినీతి ఆధారంగా బాబు పై యాక్షన్ కి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. నవంబర్ 11 న ఆర్థిక శాఖ అనుమతితో సీబీడీటీ కమిషనర్ సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటన ఇప్పటికే ఏపీలో కలకలం రేపింది. ఈ ప్రకటన ముఖ్యంగా అటు చంద్రబాబునాయుడును ఇటు ఎల్లో మీడియాను నిద్ర లేకుండా చేస్తోందట.

ఒక ప్రముఖ కంపెనీ కు అమరావతి లో భవనాల నిర్మాణాలకు 2500 కోట్లకు పైగా కాంట్రాక్టును టీడీపీ ప్రభుత్వ హయాంలో దక్కించుకుంది. అందుకుగాను సదురు కంపెనీ ఏపీకి చెందిన ఓ ముఖ్య నాయకుడికి 720 కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పందం కుదురిందనేది ప్రధాన ఆరోపణ. ‌‌అందులో భాగంగా ఆ ముఖ్య నాయకుడికి 150కోట్ల రూపాయల క్యాష్ ను అందజేసినట్టు ఐటీ తనిఖీల్లో స్పష్టంగా తేలిందని సీబీడీటీ ప్రకటించింది.

ఈ 150 కోట్ల పై వివరణ ఇవ్వాలని ఏ క్షణమైనా సదురు నేతకు ఐటీ నుంచి నోటీసులు కూడా పంపుతారని బీజేపీ నేతలే చెబుతున్నారు.

అయితే ఏపీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు ఆ ముఖ్య నాయకుడు చంద్రబాబేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాని మోడీ-షా లను ఎన్నికల సమయంలో అనరాని మాటలు అన్న చంద్రబాబు పై త్వరగా యాక్షన్ తీసుకోవాలని ఏపీకి చెందిన బీజేపి నేతలు హైకమాండ్ కు పదే పదే గుర్తు చేస్తున్నారట..
చంద్రబాబుపై ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని సంకేతాలు వెలువడుతున్నాయి.

చంద్రబాబుతో సహా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సొమ్ములు కూడా సీజ్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. బ్యాంకులకు కన్నం వేసిన సుజనా చౌదరి, సీఎం రమేష్ పై కూడా ఐటీ అధికారులు త్వరలో యాక్షన్ తీసుకుంటారనే చర్చ కూడా ఢిల్లీ లో జరుగుతోంది. ఈ క్రమంలోనే

చంద్రబాబుకు ఐటీ నోటీసులు అంది ఏ క్షణమైనా ఆయన జైలు పాలు కావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -