Friday, April 26, 2024
- Advertisement -

మోడీతో జగన్ ను దూరం చేసే టీడీపీ కుట్ర..

- Advertisement -

ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ల మధ్య పుల్లలు పెట్టాలని చూసి వారి మైత్రిని చెడగొట్టడానికి ప్రయత్నించిన టీడీపీ, ఎల్లో మీడియా ఇప్పుడు కొత్త ఎత్తు వేశాయని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. తాజాగా కేసీఆర్, జగన్ ల భేటిని పచ్చమీడియా ఫోకస్ చేసిన తీరును వారు ఖండిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో విభజనసమస్యలు, గోదావరి జలాలు సద్వినియోగంపై చర్చించిన సీఎంల భేటిని పచ్చమీడియా, టీడీపీ కేంద్రంలోని బీజేపీతో ఫైట్ కు వీరిద్దరూ ప్రయత్నిస్తున్నారని ఫోకస్ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఈ మేరకు జాతీయ మీడియాకు కూడా ఉప్పదించి.. మోడీని ఎదుర్కోవడానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసిపోయారనేలా లీకులు ఇవ్వడం గమనార్హం.

నిజానికి గోదావరి జలాలను నాగార్జున సాగర్ టు శ్రీశైలం.. అటు నుంచి రాయలసీమకు తరలించే పథకాన్ని ఆలోచించడానికి ఇద్దరు సీఎంలు భేటి అయినట్టు ప్రకటించారు. విభజన సమస్యలను కూడా చర్చించినట్టు తెలంగాణ సీఎంవో స్పష్టమైన ప్రకటన ఇచ్చింది.

అయితే వారు నాలుగు గంటలపాటు చర్చించారని.. తెలంగాణ, ఏపీపై దూసుకొస్తున్న బీజేపీని కాచుకోవడం.. నరేంద్రమోడీని టార్గెట్ చేసేందుకే ఇద్దరు సీఎంలు సమాలోచనలు జరిపినట్టు టీడీపీ, పచ్చమీడియా ఫోకస్ చేసింది. జాతీయ మీడియాల్లోనూ ఇదే తరహా కథనాలు వెలువడడం సంచలనంగా మారింది.

దీన్ని బట్టి బలమైన కేంద్రంలోని మోడీతో తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి జగన్-మోడీ సంబంధాలను చెడగొట్టే ప్రయత్నాలకు పచ్చమీడియా, టీడీపీ సిద్ధమైందన్న అనుమానాలు వైసీపీ శ్రేణులను వెంటాడుతున్నాయి. మరి ఈ విషయంలో వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకొని కౌంటర్ ఇస్తుందనేది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -