ఓటు హ‌క్కు వినియోగించుకున్న సినీ ప్ర‌ముఖులు..

625
Telangana Election 2018 : tollywood celebrities cast votes in Telangana polls
Telangana Election 2018 : tollywood celebrities cast votes in Telangana polls

రాష్ట్రంలో నేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు కొందరు రాజకీయ దిగ్గజాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు జీవన్మరణ సమస్యగా మారింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలు పలువురు సొంత నియోజకవర్గాల్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంబ‌మ‌యిన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. సినీ , రాజ‌కీయ ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ ఉదయం తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినిలతో కలసి జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ బూత్ నకు వచ్చిన ఆయన ఓటేసేందుకు సుమారు 40 నిమిషాల పాటు క్యూలైన్లో వేచి చూసి, ఆపై ఓటేశాడు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకోగా, కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్, నటులు చిరంజీవి, నితిన్, అల్లు అర్జున్, అక్కినేని నాగర్జున, అమల, వన్డే నవీన్ , రాజ‌మౌళి తదితరులు జూబ్లీహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.