అక్కడ టీడీపీ నేతను ఎవరు పట్టించుకోవట్లేదా..?

375
There bobbili TDP leader peekesthunnaraa who is the alternative
There bobbili TDP leader peekesthunnaraa who is the alternative

అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోవడం మానేసి , ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల పట్ల మొసలి కన్నీళ్లు కార్చడం ఒక్క టీడీపీ కే చెల్లింది.. ఒక్కరా ఇద్దరా… తెలుగు దేశంపార్టీ అధినేత తో సహా ప్రతి తెలుగు లీడర్ ప్రజలను పట్టించుకోకుండా తమ ఆస్తులను కూడబెట్టుకునేందుకు కష్టపడినవారే.. అలాంటి వారికి ఈ సారి దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి చెప్పగా కొందరిని అయితే జాడ కూడా లేకుండా చేశారు ప్రజలు.. కొన్ని చోట్ల ప్రజలు టీడీపీ ని గుర్తుంచుకుని కాస్తో కూస్తో ఓట్లు పడినా బొబ్బిలో మాత్రం టీడీపీ ని నామరూపాల్లేకుండా చేశారు.. అందుకు నిదర్శనం బొబ్బిలి అని చెప్పుకోవాలి..

ఈ నియోజకవర్గంలో టీడీపీ తరపున ప్రతినిత్యం వహించిన బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగారావు ను ఇక్కడ ప్రజలు దాదాపు మర్చిపోయారని చెప్పొచ్చు.. ఓటమి దగ్గరినుంచి ఆయన కూడా పెద్ద ప్రజలకు కన్పించడం మానేశారు.. పార్టీ కార్యక్రమాలకు దూరం గా ఉంటూ రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లు కనిపిస్తున్నారు.. అయితే ఆయనే కావాలని దూరం గా ఉంటున్నారా లేదా పార్టీ , ప్రజలు దూరం పెట్టారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది..

చంద్రబాబు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లకు కూడా ఆయన హాజరుకాకపోవడం తో అదే నిజమనిపిస్తుంది. బొబ్బిలి నియోజకవర్గంలో కార్యకర్తలు ఇటీవల ఈ విషయాన్ని కేంద్ర పార్టీ కార్యాలయానికి కూడా తెలియజేశారు. తమకు నాయకుడు లేరని, పార్టీ కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నామని కొందరు కార్యకర్తలు కేంద్ర పార్టీ కార్యాలయానికి ఫోన్ చేసి మరీ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి బొబ్బిలి నుంచి గెలిచారు. ఆ తర్వాత పార్టీ మారిపోయిన ఆయన 2019 లో దారుణంగా ఓటమి పాలయ్యారు.. ఇక అక్కడి టీడీపీ వర్గం కూడా ఆయనను తప్పించి కొత్త నేతను ఎంపిక చేయాలనీ కోరిన నేపథ్యంలో రాజు గారి ని పీకేసి కొత్త టీడీపీ నేత ఎవరోస్తారనేది ఇప్పుడు పెద్ద చర్చనీయ అంశమైంది..

Loading...