Saturday, April 27, 2024
- Advertisement -

కేటీఆర్ దూకుడు… తొలి పార్ల‌మెంట్ అభ్య‌ర్తిని ప్ర‌క‌టించిన కేటీఆర్..

- Advertisement -

ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ కూడా అదే దూకుడును కొన‌సాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒకే సారి అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌తి ప‌క్షాల‌కు షాక్ ఇచ్చారు కేసీఆర్‌. ముంద‌స్తుగా అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించ‌డం క‌ల‌సి వ‌చ్చింది.

ఇక లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ అదే వ్యూహాత్మ‌కంతో ముందుకెల్తున్నారు కేసీఆర్‌. తెలంగాణలో మెజార్టీ స్థానాలను గెలవాలని లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే కేటీఆర్‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియ‌మించి తాను జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు నిర్ణం తీసుకున్నారు.సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వబోతున్నట్టు సంకేతాలిచ్చారు. ఇటీవల ఢిల్లీలో పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ మేరకు హామీ ఇచ్చారు.

వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన త‌ర్వాత కేటీఆర్ నిత్యం ప్రజలతోనే ఉంటూ స‌భ‌లు , స‌మావేశాల‌తో దూసుకుపోతున్నారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ మరోసారి పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పార్టీ తొలి ఎంపీ అభ్య‌ర్తిని ప్ర‌క‌టించారు.

మ‌రో వైపు జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి సారించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేస్తార‌నే సంకేతాలు ఇప్ప‌టికే పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు , శ్రేణుల‌కు పంపింది. నల్గొండ నుండి కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగనున్నార‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. నల్గొండ నుండి కేసీఆర్ ఎంపీగా పోటీ చేయడం ద్వారా జిల్లాలో ప్రభావం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -