వైసీపీ కి దూరమయ్యే ఆలోచనలో దళిత నేతలు..

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేవని చెప్పాలి.. ఏ రాష్త్రంలోనూ ముఖ్యమంత్రి ని ఇంతలా ఏ ప్రతిపక్షాలు టార్గెట్ చేయలేదు.. ప్రతి విషయంలో అధికార ప్రభుత్వాన్ని నిందిస్తూ, కోర్టు లో కేసులు వేసి గెలుస్తూ , అసలు ప్రభుత్వంలో ఉన్నది టీడీపీ నా, వైసీపీ నా అన్నది తెలీకుండా టీడీపీ ప్రవర్తిస్తుంది.. ఓ వైపు నేతలు జైలుకు వెళుతున్నా ఏమాత్రం తగ్గకుండా వైసీపీ ని విమర్శలపాలు చేస్తూ గుదిబండలా తయారైంది.. ఇక అమరావతి భూముల విషయం లో అయితే జగన్ ఎంత బ్యాడ్ చేయాలో అంత చేసేసింది టీడీపీ. దీంతో చంద్రబాబు ఇపుడు టీడీపీ లో పెద్ద హీరో అయిపోయాడు.. మొన్నటివరకు చంద్రబాబు విలన్ గా కనిపించగా ఈ దెబ్బతో పార్టీ లో కొత్త ఉత్సాహం ఉరకలువేస్తోంది. అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ నుంచి వైసీపీ లోకి చేరికలు మాత్రం ఆగట్లేదు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ లోకి డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు నేతలు.

జగన్ ఎప్పటికప్పుడు ఇలా రాజకీయాలు చేస్తూ పార్టీ ని బలోపేతం చేస్తూ పోతుంటే దళిత ఎమ్మెల్యేల తీరు ఆయనకు తలనొప్పిగా మారుతున్నాయి.. వాళ్ళ నియోజక వర్గంలో ఉన్న వర్గ భేదాలు జగన్ కి ఎలా ఢీల్ చేయాలో అర్థం కావట్లేదు.. కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, కోట్ల హర్షవర్ధన్ రెడ్డిలకు మధ్య విభేదాలు తీవ్ర మయ్యాయి. జగన్ వద్దకు ఈ పంచాయితీ ఎన్నిసార్లు వచ్చిన అక్కడ కాంప్రమైజ్ అయ్యి బయట యధావిధిగా కొట్టుకునేవారట..ముఖాయంగా ఏదైనా కాంట్రాక్టు పనులు ఎమ్మెల్యేకు తెలియకుండా హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులకు కట్టబెడుతున్నారట.

- Advertisement -

దీంతో ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చి అధికారులపై ఫైర్ అవుతున్నారట. ఎక్కడైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఏ పనైనా జరగాలి.. కానీ అలా కాకుండా ఇక్కడ రివర్స్ అవుతుండడంతో ఎమ్మెల్యే కు కోపం వస్తుంది.. అధికారులు కూడా హర్షవర్ధన్ రెడ్డి వైపే ఉండటంతో ఎమ్మెల్యే ఏమీ చేయలేకపోతున్నారు. ఇక పాయకరావుపేటలో సీనియర్ నేత, ఎమ్మెల్యే గొర్ల బాబూరావు పరిస్థితి కూడా ఇంతే. ముందు వైసీపీలోని దళిత ఎమ్మెల్యేల సమస్యలను జగన్ వినాలని, తర్వాత బయట సమస్యలను పరిష్కరించవచ్చని ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి వేరే పార్టీ చూసుకోవాల్సి ఉంటుందని సంకేతాలు కూడా కొందరు పంపుతున్నారు.

వైసీపీ మరో లీడర్ లో అసంతృప్తి.. పెరిగిపోతుందా..?

ఆ ఇద్దరి లో ఒకరికి ఇవ్వకుంటే టీడీపీ కొలాప్స్..?

జగన్, చంద్రబాబు పోటీ పడి మరీ మోడీ కి జై కొడితే ఎలా..?

జగన్ ఢిల్లీ టూర్ కి వెళ్లి ఏం సాధించుకోచ్చారు..?

Most Popular

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఫుడ్ విషయంలో కూడా కొందరు ఇష్టంగా కొన్ని తింటారు. మన సెలబ్రీటీలు ఇష్టంగా తినే ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. మహేష్ చాలా...

ప్రభాస్ ’రాధేశ్యామ్’ మూవీ స్టోరీ లీక్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజాగా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక...

Related Articles

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

ఏపీ పోలీసు శాఖకు 103 అవార్డులు

ఏడాది కాలంలో ఏపీ పోలీసు శాఖకు 103 అవార్డులు రావడం సంతోషంగా ఉందని, దేశంలోనే ఏపీ పోలీసుల మెరుగైన సేవలకు అవార్డులే నిదర్శనమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు....

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...