Friday, April 26, 2024
- Advertisement -

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తాం: వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ రైతుల‌కు వ‌రాల జ‌ల్లులు కురిపించారు. ఆయ‌న చేప‌ట్టిన పాద‌యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో పైలాన్‌ను ఆయన ఆవిష్కరించిన జ‌గ‌న్‌…ఇచ్చాపురంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌తో ముగిసింది. వైసీపీ అధికారంలోకి రాగానే న‌వ‌ర‌త్నాల ప‌ధ‌కాల‌ను ప్ర‌తి పేద‌వానికి అందే విధంగా చేస్తామ‌న్నారు. ప‌గ‌టి పూట రైతుల‌కు 9 గంట‌లు విద్యుత్‌ను అదిస్తామ‌ని తెలిపారు.

ఇక రైతుల‌కు వ‌డ్డీ లేని రుణాల‌ను బ్యాంకుల నుంచి ఇప్పిస్తామ‌న్నారు. రైతుల‌కు ఉచితంగా ప్ర‌భుత్వ‌మే బోర్లు వేయిస్తుంద‌న్నారు. పెట్టు బ‌డుల‌కు గాను… ప్రతి ఏడాది మేలో రైతుకు రూ.12,500 సాయం అందిస్తాం’’ అని జగన్ హామీ ఇచ్చారు. ప్ర‌తీ గ్రామంలో గ్రామ స‌చివాయాన్ని ఏర్పాటు చేస్తామ‌ని అందులో…ఆ ఊరిలోని ప‌దిమందికి ఉద్యోగాలు కూడా ఇస్తామ‌ని తెలిపారు. గ్రామ సచివాలయం ద్వారా పథకాల అమలును సమీక్షిస్తామని, కుల, మత, పార్టీలకతీతంగా పథకాలను అమలు చేస్తామని తెలిపారు.

ప్ర‌తీ గ్రామంలో 5ం ఇళ్ల‌కు ఒక వాలంటీర్‌ను నియ‌మిస్తామ‌ని…వాలంటీర్‌కు రూ.5000 జీతం కూడా ఏర్పాటు చేస్తామ‌న్నారు. వాలంటీర్ల ద్వారా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌క్ర మంగా అందేలా చూస్తామ‌న్నారు.అక్వా రైతుల‌కు యూనిట్ విద్యుత్‌ను రూ. 1.50 పైస‌ల‌కే అందిస్తామ‌ని తెలిపారు. ద‌ళారీల వ్య‌వ‌స్థ‌ల‌ను రూపు మాపి రైతులు పండించిన పంట‌ల‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర క‌ల్పిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌విస్తే రైతులు న‌ష్ట‌పోకుండా రూ.3000 కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేస్తామ‌న్నారు. అలాగే మ‌రో రూ.4000కోట్లు ప్రకృతి విపత్తులు ఫండ్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్ర‌తీ మండ‌లంలో కోల్డ్ స్టోరేజ్‌లు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. సహకార రంగంలో డైయిరీకి పాలు పోస్తే లీటర్ కు రూ.4 చొప్పున బోనస్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రకృతి విపత్తుల వల్ల కొబ్బరి చెట్లు కుప్పకూలిపోతే చెట్టుకు మూడు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని, జీడితోటలకు నష్టపరిహారం రూ. 30 వేలు కాస్తా 50వేలు చేస్తానని స్పష్టం చేశారు.

ప్రమాదవ శాత్తు రైతు చనిపోతే వైఎస్ఆర్ భీమా కింద రూ.5లక్షలు చెల్లిస్తానని చెప్పారు. ఇదే అంశంపై మెుట్టమెదట చట్ట సభలో శాసనం చేస్తానని హామీ ఇచ్చారు. ట్రాక్ట‌ర్ల‌కు లైఫ్ టైమ్ రోడ్ ట్యాక్స్ లేకుండా చేస్తామ‌ని రైతుల‌కు హామీ ఇచ్చారు.

అలాగే వైసీపీ అధికారంలోకి రాగానే …మేం చెప్పిన పథకాలన్నీ పేదవాడి ఇంటికి చేర్చుతామ‌న్నారు. 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చుతామ‌న్నారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తే పరిపాలన మరింత సౌలభ్యంగా ఉంటుందన్నారు. దీని వ‌ల్ల ప‌రిపాల‌నా సౌల‌భ్యం క‌లుగుతుంద‌న్నారు. ఏడు నియోజ‌క వ‌ర్గాల ప‌రిధిలో క‌లెక్ట‌ర్లు మంచి పాల‌న‌ను అందిస్తారన్నారు. న‌వ‌ర‌త్నాల్లాంటి ప‌థ‌కాల‌ను ప్ర‌తి పేద‌వాడికి అందేలా అమ‌లు చేస్తామ‌ని జ‌గ‌న్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -