Friday, April 26, 2024
- Advertisement -

ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర…

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్‌ పాలించింది ఐదేళ్ల మూడు నెలలే అయినప్పటికీ ఎవ‌రూ ప్ర‌వేశ పెట్ట‌ని సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేపెట్టి తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చివ‌రి ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో త‌న పాద‌యాత్ర ద్వారా పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపు బంప‌ర్ మెజారిటీతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికార పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా 15 ఏళ్లు. 1,400 కిలోమీటర్ల పైబడి ఆయన చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాల‌ను తెలుసుకున్న వైఎస్ఆర్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజునెరైతుల‌కు ఊర‌ట‌క‌లిగించే ఉచిత విద్యుత్‌పైనె తొలి సంత‌కం చేసి త‌న మాట నిలుపుకున్న మ‌హానాయ‌కుడు. అప్ప‌టికి రైతులు బకాయీ పడి ఉన్న రూ.1,250 కోట్ల విద్యుత్‌ బిల్లులను కూడా రద్దు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్, తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, 108, 104 వంటి పథకాలు, సేవలు పేదలకు ఎంతో ఊర‌ట‌నిచ్చాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్‌ పాలించింది ఐదేళ్ల మూడు నెలలే అయినప్పటికీ పాలనపై తనదైన ముద్రవేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలుచేయ‌డంతోపాటు ఇవ్వ‌ని హామీల‌ను కూడా అమ‌లు చేసి చూపించిన జ‌న‌నేత వైఎస్ఆర్‌.

ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ మరో విప్లవాత్మకమైన పథకంగా నిలిచింది. నేటికీ లక్షలాది మంది విద్యార్థులు తమ చదువులను నిరాఘాటంగా కొనసాగించగలుతున్నారంటే వైఎస్‌ తన పాలనలో ఇచ్చిన భరోసాయే కారణం. ఇప్ప‌టికి విద్యార్థులు వైఎస్ఆర్‌ను త‌లుచుకుంటున్నారు. ముస్లింలకు తన హయాంలో 4 శాతం విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి ఆ వర్గాల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.

వైఎస్‌ సంకల్పించిన మరో అద్భుతమైన పథకం జలయజ్ఞం. ఆయన హయాంలో చిన్నా, చితకా 48 ప్రాజెక్టుల వరకూ ఎంపిక చేసి వాటన్నింటినీ సాకారం చేయాలని సంకల్పించారు. నాడు ఆయన వేసిన పునాదులు, 80 శాతం వరకూ చేసిన వివిధ ప్రాజెక్టులూ నేటికి పూర్తయి జలఫలాలను ఇస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -