Saturday, April 27, 2024
- Advertisement -

రమణ లోడ్ ఎత్తాలిరా నటుడు గురించి ఎవరికి తెలియని నిజాలు..!

- Advertisement -

రమణ లోడ్ ఎత్తాలి రా డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిలేరు నీకెవ్వరు లో ఒక ముసలాయన చెప్పిన ఈ డైలాగ్ కి ఆయన కూడా ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్న ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఆ పెద్దాయనకి రమణ డైలాగ్ తో వచ్చేసిందని చెప్పాలి. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు రమణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రమణ అసలు పేరుకు కుమనన్ సేతురామన్. ముందు పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే. 1984లో ఆయన చెన్నై నుండి వైజాగ్ షిఫ్ట్ అయ్యారు. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా వర్క్ చేసిన ఆయనకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అనుకోకుండా ఒక షూటింగ్ చూడడానికి వెళ్లిన కుమనన్ కు అక్కడ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు ఇచ్చిన డైలాగ్ సరిగ్గా చెప్పకపోవడంతో కుమనన్ నవ్వాడట. వెంటనే అక్కడున్న డైరెక్టర్ డైలాగ్ చెప్పమని కుమనన్ ను అడగడంతో టక్కున చెప్పేశారట.

అక్కడి నుండి సినిమా ప్రయాణం మొదలైంది. కుమనన్ అల్లుడు శీను చిత్రంలో బాబా క్యారెక్టర్లో అలరించారు. అలాగే రీసెంట్ గా వచ్చిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో బోయజాతి లీడర్గా నిహారిక తండ్రిగా కూడా చేశారు ఆయన. ఆయన భార్య పేరు మహాలక్ష్మి. వీళ్లకు ఒక అబ్బాయి. పేరు హేమంత్. కుమనన్ గారికి ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీలో తన కొడుకు హేమంత్ కి ట్రైనింగ్ ఇప్పించారు. హేమంత్ ఇప్పుడు హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద ఫేమస్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్.

వెడ్డింగ్ అనే కాకుండా తన తండ్రికి కూడా ఎవరూ ఊహించని రీతిలో ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ క్రియేట్ చేసి మరి ఫోటోస్ తీస్తూ ఫోటోగ్రఫీ పేజీలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతను తీసిన ఫోటోస్ లో కుమనన్ గారిని
చూస్తే హాలీవుడ్ హీరో రేంజ్ లో కనిపిస్తారు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ మంచి రోల్ కోసం ఎదురు చూస్తూ కుమనన్ గారికి ఎట్టకేలకు సరిలేరు నీకెవ్వరు చిత్రం బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. చెప్పింది ఒక్క డైలాగ్ అయినప్పటికి దాని ఇంమ్పాక్ట్ చాలా క్రియేట్ చేసింది. డైలాగ్ తో పాటు 60 ఏళ్ల వయసులో కూడా ఆయన తన బాడీని మెయిన్‍టైన్ చేసిన తీరు ఎంతో ఇన్స్పైర్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -