Saturday, April 27, 2024
- Advertisement -

జిమ్ కి బై…బై…చెప్పేయండి

- Advertisement -

అధిక బరువు తగ్గించుకోవటానికి జిమ్ కి వెళ్ళనవసరం లేదు. అక్కడ గంటల కొద్ది వ్యాయామాలు చేసి చెమట చిందించ నవసరం లేదు.

ఒకే ఒక్క హార్మోన్ మీ బరువును సునాయాసంగా తగ్గిస్తుందని అంటున్నారు పరిశోదకులు. ఇటీవల శాస్త్రజ్ఞులు సృష్టించిన ఎం ఓ టి ఎస్ – సి అనే హార్మోన్ బరువును తగ్గించటమే కాకా జీవక్రియలను క్రమబద్దీకరణ చేస్తుందని అంటున్నారు.

జీవక్రియలు మందగించటం అనేది అధిక బరువుకు కారణం అవుతుంది. అందువల్ల ఈ సమస్యను ఎం ఓ టి ఎస్ – సి అనే హార్మోన్ తగ్గిస్తుందని అంటున్నారు పరిశోదకులు. స్త్రీలలో  ధైరాయిడ్, రుతు సంబంద సమస్యలు, హార్మోన్స్

అసమానతలు కారణంగా అధిక బరువు పెరుగుతారు. ఈ సమస్యలకు ఈ హార్మోన్ బాగా పనిచేస్తుంది.

అయితే ముందుగా ఈ హార్మోన్ ని ఎలుకల మీద ప్రయోగం చేసారు. ఇన్సులిన్ నిరోధం కారణంగా బరువు ఎక్కువగా పెరిగిన ఎలుకలకు ఈ హార్మోన్ ఇంజెక్ట్ చేస్తే హార్మోన్ సమతుల్యం జరిగినట్టు గుర్తించారు. అయితే ఈ హార్మోన్ మనుషుల మీద ఎంతవరకు పనిచేస్తుందో ఇంకా పూర్తి స్థాయిలో పరిశోదన చేయవలసి ఉంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -