Friday, April 26, 2024
- Advertisement -

బాబు అనుభవం సీమాంధ్రులను ఏ స్థాయిలో ముంచిందంటే?

- Advertisement -

వైఎస్ జగన్‌కి ఏం అనుభవం ఉంది అని ప్రశ్నించడంతో పాటు ప్రపంచంలోనే నా అంత అనుభవజ్ఙుడు లేడు అని చెప్పుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటు. ఆ అనుభవం పేరు చెప్పుకునే 2014 ఎన్నికల్లో గెటాన్ అయ్యాడు. చంద్రబాబు నిజాయితీ, విలువలు, పాలన నచ్చి ఆయనకు మద్దతిస్తున్నా అని తెలుగు నాయకుడు ఎవ్వరూ చెప్పలేరు కాబట్టే పవన్ కళ్యాణ్‌లాంటి వాళ్ళు కూడా తెరవెనుక ప్రయోజనాలు ఏం పొందినా తెరముందు మాత్రం బాబు అనుభవం అని చెప్పి ఆయనకు మద్దతిచ్చారు. మరి అలాంటి అనుభవజ్ఙుడు సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడాడా? కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రాబట్టుకోవడంలో కనీసం నిజాయితీగా ప్రయత్నం చేశాడా? తెలంగాణా రాష్ట్రం నుంచి లక్ష కోట్లు రావాలి అని ఇప్పుడు చెప్తున్న చంద్రబాబు ఈ ఐదేళ్ళలో ఏం చేశాడు? అసలు చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్‌కి ఏ మాత్రమైనా అక్కరకొచ్చిందా?

రాజధాని నుంచి మొదలెడితే………హైదరాబాద్ నుండి పారిపోయి విజయవాడ వెళ్ళాక ,ప్రభుత్వ కార్యాలయాల కోసం అద్దె భవనాలు ఎక్కడ తీసుకోవాలి అని iyr గారి అధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మూతపడిన రెండు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యా లతో మాట్లాడి నామమాత్రపు అద్దెతో ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకోవచ్చని సూచించారు. అప్పుడు బాబు కమిటీ ని రద్దు చేసి అతని కులానికి చెందిన వాళ్ళ భవనాలు ,హోటల్స్ ఇష్టం వచ్చినంత అద్దె చెల్లించి తీసుకున్నారు .10 రూపాయల ఖర్చుకు 30 రూపాయలు చెల్లించడం లాగా. దీనితో విజయవాడ లో సామాన్యులు జీవివించలేనంత గా అద్దెలు పెరిగిపోయాయి.

నిజంగా విజన్ వున్న నాయకుడు అయితే ప్రజల కోసం రాజధాని కట్టాలని చూసేవాడు కాని ,ఆ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు కొట్టేయాలని చూసేవాడు కాదు.రాజధాని నిర్మాణం కోసం కేంద్రం సాయం చేస్తుంది,చేసింది. ఇచ్చిన 2000 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పకుండా ,చివరికి హై కోర్ట్ ని ఎన్నికల మూడు నెలల ముందు ప్రారభించారు. అది కూడా తాత్కాలిక భవనం.

రాజధాని కి పరిశ్రమలు వస్తున్నాయని ప్రజల్ని ఎమర్చడానికి ,NRI ల చేత సూట్ కేసు కంపనీ లు పెట్టించడం,వందల ఎకరాలు ఆ కంపెనీ పేరు మీద పన్చేయడం. నిజానికి అక్కడ ఎటువంటి కంపెనీ లు లేవు .ఉన్నదంతా పేపర్ మీద..

కేంద్రం బడ్జెట్ 25 లక్షల కోట్లు .అలాంటిది ఒక రాష్ట్రం రియల్ ఎస్టేట్ వ్యపారం లాగా చేస్తున్న పనికి లక్ష కోట్లు ఎలా ఇస్తుంది అని విజ్ఞత వున్న ఎవడైనా ఆలోచిస్తాడు? అసలు ఎందుకు ఇవ్వాలి ? ఓ వైపు దేశం లోనే రాష్ట్రం అభివృద్దిలో మొదటి స్థానం అంటూ ప్రచారం,లక్షల కోట్లు పెట్టుబడులు అంటూ డంభాలు,స్పెషల్ ఫ్లైట్ లు వేసుకొని తిరగడం…ఇంత బాధ్యత లేని రాష్ట్రానికి కేంద్రం ఎలా ,ఏమి సాయం చెయ్యాలి?

ఏ ప్రభుత్వం అయినా చేసే అభివృద్దిలో ఎన్నికల ప్రయోజనం దాగి వుంటుంది.కేంద్రం చేయాల్సిన 100 % సహాయం,సహకారం చేస్తున్నా……ఎక్కడా కేంద్ర ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా ,పైగా కేంద్ర పథకాలకు కూడా చంద్రబాబు పేరు వేసుకుంటున్నాడంటే చంద్రబాబు ఎంత నీచుడో అర్థం అవుతుంది..

లోటు బడ్జెట్ తో ప్రారంభమైన తన స్వలాభం కోసం అప్పుల ఊబిలోకి నెట్టేశాడు. ఈ అప్పుల ఊబి సంగతి చూస్తే మతి పోతుంది…..

అదండి సంగతి……….ప్రపంచ జ్ఙానిని అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఇప్పుడు కనీసం నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని స్వయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలలోనే న్యూస్ ఐటెమ్స్ వచ్చాయి. మరోవైపు ముఖ్యమంత్రిగా ఏ అనుభవమూ లేని కేసీఆర్ పనితనం ఏంటో చూస్తూనే ఉన్నాం. అంతకుముందు ఎన్టీఆర్ కూడా ఎలాంటి అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికీ చంద్రబాబు ఆ ఎన్టీఆర్ పాలన, పథకాలు చూపించే ఓట్లు అడుగుతుంటాడు. తన పాలన అనుభవం, పథకాలు మాత్రం చెప్పలేని దుస్థితి. అనుభవం కాదు………ఆలోచనలు ముఖ్యం….చిత్తశుద్ధి, విలువలతో కూడిన రాజకీయం………..ప్రచార మాయలతో కాకుండా ప్రజాభిమానంతోనే గెలవాలి అని పనులు చెయ్యడం ముఖ్యం. అలాంటి లక్షణాలు ఏ కోశానా లేవుగానీ ప్రపంచంలోనే నా అంత అనుభవజ్ఙుడు లేడు అని మరోసారి ప్రచార మాయలు మాత్రం చేస్తున్నారు. నేను ప్రారంభించినవి సగంలో ఆగిపోకూడదంటే నన్నే గెలిపించండి అని ప్రచార జిమ్మిక్కులు చేస్తున్నారు. కేవలం ప్రచార జిమ్మిక్కుల విషయంలో మాత్రమే అనుభవం ఉన్న నాయకుడిని మరోసారి ప్రజలు కోరుకుంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -