Saturday, April 27, 2024
- Advertisement -

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన బ్యాట్ ఎవ‌రిదో తెలుసా…?

- Advertisement -

సాధార‌నంగా గొప్ప‌గొప్ప ఇన్నీంగ్స్‌లు ఆడిన క్రికెట్ దిగ్గ‌జాల బ్యాట్‌ల‌ను వేలంపాట వేయ‌డం మ‌నం చూశాం. భారీగ ద‌ర ప‌లుతుంటాయి. అయితే ప్ర‌పంచంలో అత్యం ఖ‌రీదైన బ్యాటు ఏదంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది 2011 ప్రపంచకప్ ఫైనల్ లో నాటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వాడినది అని చెప్పవచ్చు. వేలంలో అమ్ముడైన బ్యాట్లలో కెళ్లా అత్యధిక ధర పలికింది ధోనీ వరల్డ్ కప్ విన్నింగ్ షాట్ బ్యాట్. ఇంతకీ అది వేలంలో అమ్ముడైన ధర ఎంతంటే 72 లక్షల రూపాయలు.

2011 ఏప్రిల్ రెండో తేదీన టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ లో శ్రీలంక మీద నెగ్గిన సంగతి తెలిసిందే. నేటితో ఆ ఫీట్‌కు ఏడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. జట్టు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి అద్భుతమైన ఆడిన తీరు, విజయాన్ని తనదైన శైలిలో సిక్స్‌తో ముగించడం.. ఇదంతా భారత క్రికెట్ చరిత్రలోని ఒక అపూర్వఘట్టం. అలా టీమిండియా ప్రపంచకప్ ను నెగ్గిన మూడు నెలల తర్వాత లండన్ లో ఒక చారిటీ డిన్నర్ ను నిర్వహించారు.

ధోనీ వరల్డ్ కప్ ఫైనల్లో వాడిన బ్యాట్ ను కూడా అక్కడ వేలానికి ఉంచారు. అది ఏకంగా 72 లక్షల రూపాయల ధరకు అమ్ముడైంది. ముంబైకి చెందిన ఆర్కే గ్లోబల్ అనే సంస్థ ధోనీ బ్యాట్‌ను రికార్డు స్థాయి ధర చెల్లించి కొనుక్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -