ఇషాంత్ శర్మ బౌలింగ్.. సఫారీ ఓపెనర్ చేతి వేళ్లు చిట్లినాయి..!

1756
Aiden Markram punches object, ruled out of third Test
Aiden Markram punches object, ruled out of third Test

ఎవరైన చాలా సందర్భాల్లో కోపడితే పక్కనే ఉన్న వారు తన కోపమే తన శత్రువు అని చెబుతుంటారు. భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు విజయం కోసం ఎంతో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టెస్టి సిరిస్ ను 0-2తో కోల్పోయారు.

అయితే రెండో టెస్టు లో సఫారీ ఓపెనర్ ఐడెన్ మార్ క్రమ్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ పేలవంగా అవుటయ్యాడు. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్ లో ఇషాంత్ శర్మ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికాడు. అయితే టీవీ రీప్లేలో అది నాటౌట్ అని తెలింది. దాంతో కోపం భరించలేక డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న గోడను బలంగా గుద్దాడు. దాంతో అతని చేతికి బలమైన గాయం అయింది.

చేతి వేళ్ల ఎముకలు చిట్లినట్లు వైద్య పరీక్షలో తెలింది. దాంతో శనివారం మొదలయ్యే మూడో టెస్టులో మార్ క్రమ్ ఆడకపోవచ్చని దక్షిణాఫ్రికా వర్గాలు చెబుతున్నాయి. చికిత్స కోసం మార్ క్రమ్ స్వదేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Loading...