Friday, April 26, 2024
- Advertisement -

డేవిడ్ వార్న‌ర్‌కు మ‌రో ఎదురు దెబ్బ‌…

- Advertisement -

బాల్ టాంప‌రింగ్ వివాదంలో చిక్కుకున్న ఆసిస్ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్నారు. తాజాగా వార్న‌ర్‌కు మ‌రో ఎదురు దెబ్బ‌త‌గిలింది. బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా సిక్సర్స్ టీమ్‌కు ఆడుతున్న వార్నర్ మోచేతికి తీవ్ర గాయమైంది. ఆ గాయానికి సర్జరీ చేయాల్సి రావచ్చని సిక్సర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

అయితే మ‌రో రెండు నెలల్లో నిషేధం పూర్తయి మళ్లీ నేషనల్ టీమ్‌లోకి ఆశపడుతున్న వార్నర్‌కు ఇది చేదు అనుభ‌వ‌మే అని చెప్పాలి. సిల్హెట్ సిక్సర్స్, రంగాపూర్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ బౌలింగ్‌లో రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో వార్తల్లో నిలిచిన వార్నర్.. ఆ వెంటనే ఇలా గాయం బారిన పడ్డాడు.

ఈ గాయం కారణంగా అతడు కనీసం నెల రోజులు క్రికెట్‌కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. సర్జరీ జరిగితే మాత్రం మరింత ఎక్కువ కాలం క్రికెట్ ఆడే పరిస్థితి ఉండదు. అదే జరిగితే వరల్డ్‌కప్‌కు ముందు కీలకమైన మ్యాచ్ ప్రాక్టీస్‌కు వార్నర్ దూరమవుతాడు.

ఇదే బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్ కూడా ఐదు రోజుల కిందట ఇదే బీపీఎల్‌లో మోచేతికి గాయం చేసుకున్న విషయం తెలిసిందే. అతడు ఇప్పటికే స్వదేశానికి వచ్చి సర్జరీ పూర్తి చేసుకున్నాడు. మార్చి 29న ఇద్ద‌రిపై ఉన్న నిషేధం ముగియ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -