Saturday, April 27, 2024
- Advertisement -

కోర్టు మెట్లెక్కిన మిస్ట‌ర్ కూల్‌…..మోసంలో ధోనికికూడా భాగం ఉంది…

- Advertisement -

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ త‌న‌కు న్యాయం చేయ‌మ‌ని సుప్రీం కోర్టు మెట్లెక్కారు. ధోని ఏంటి కోర్టుకు వెల్లాడ‌నుకుంటున్నారా…? ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూపుకు తాను బ్రాండ్ అంబాసిడర్ కు ఉన్నందుకు ఇవ్వాల్సిన నగదును చెల్లించలేదని ధోని పిటిషన్ లో తెలిపారు. దాదాపు రూ. 40 కోట్ల రూపాయ‌లు రావాల‌న్నారు. 2009 నుంచి 2016 వరకూ ఆమ్రపాలి గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగ‌తి తెలిసిందే.

అంబాషిడ‌ర్‌గా ఉన్నందుకు పారితోషికంగా తనకు రావాల్సిన రూ.40కోట్లు ఇవ్వాల్సి ఉందని పలు దఫాలుగా అడుగుతూనే ఉన్నా కంపెనీ మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం చేస్తోందని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆమ్రపాలి గ్రూప్ సకాలంలో ఇళ్లను నిర్మించి ఇవ్వడంలో విఫలం కావడంతో సుమారు 46000 మంది హోమ్ బయ్యర్స్ ఇప్పటికే సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. కంపెనీ డైరక్టర్లు, అలాగే ఆమ్రపాలీ గ్రూపునకు చెందిన ఇతర అనుబంధ సంస్థలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీంతో ఆమ్రపాలి గ్రూప్ తో తన ఒప్పందాన్ని ధోని అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. మరోవైపు ఆమ్రపాలీ సంస్థ చేసిన మోసంలో ధోనీ కూడా సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని కస్టమర్లు విమర్శిస్తున్నారు. తాము ధోనీని చూసే నమ్మకంగా ఫ్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామని, కంపెనీతో పాటు ఎంఎస్ ధోనీపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -