Friday, April 26, 2024
- Advertisement -

ధోనిని వెంటాడుతున్న గంభీర్…. అప్పటికి కోహ్లీ టీంలో ఉంటాడో లేడో…?

- Advertisement -

మహేంద్ర సింగ్ ధోనిని వెంటాడుుతన్నాడు భాజాపా ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. కూల్ రిటైర్మెంట్ పై మరోసారి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ధోనీ ఆడటం అసాధ్యమని జోస్యం చెప్పిన ఈ మాజీ ఓపెనర్.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కూడా కొనసాగడం అనుమానమేనని బాంబ్ పేల్చాడు.

ధోని విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఏం చేస్తుందని ప్రశ్నించాడు. ధోని కంటే దేశం ముఖ్యమనే విషయం తెలియదా అంటూ నిలదీశాడు. ఎవరికైనా రిటైర్మెంట్‌ అనేది తమ వ్యక్తిగత విషయమని గంభీర్ తెలిపారు. 2023 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో నువ్వు లేవు అని ధోనీకి చెప్పె ధైర్యం ఉందాని సెలక్టర్లను ప్రశ్నించారు.యువ వికెట్ కీపర్లకి అవకాశమిస్తోంది.. దేశ జట్టుని సిద్ధం చేసుకోవడం కోసం. అంతేగానీ.. ధోనీ కోసం కాదనే విషయాన్ని ఇక్కడ అందరూ (సెలక్టర్లు, కెప్టెన్ కోహ్లి) గుర్తించుకోవాలన్నారు.

యువ క్రికెటర్లను పరీక్షించడానికి ధోని తమకు ఒక అవకాశం ఇచ్చాడని సెలక్టర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.వచ్చే వరల్డ్‌కప్‌ భారత్‌ గెలవాలంటే ఇప్పట్నుంచే అందుకు సంసిద్ధం కావాలి. రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌లతో పాటు మిగతా యువ వికెట్‌ కీపర్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు. మరి రిటైర్మెంట్ ధోని ఇప్పటికైనా స్పందిస్తారా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -