Saturday, April 27, 2024
- Advertisement -

భావోద్వేగంతో ఓట‌మిపై స్పందించిన న్యూజిలాండ్ కెప్టెన్ వియ‌మ్‌స‌న్‌

- Advertisement -

ఐసీసీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్ రెండు సార్లు టై అయినా.. అనూహ్యంగా బౌండ‌రీల ఆధారంగా ఇంగ్లండ్ జట్టు విజయం సాధించినట్టు ప్ర‌క‌టించారు. అయితే క్రికెట్ అభిమానుల అభిమాన్నాన్ని మాత్రం న్యూజిలాండ్ చూర‌గొన్న‌ది. టోర్నమెంట్ ఫైన‌ల్‌ మ్యాచ్‌ ఫలితాన్ని బౌండ‌రీల సంఖ్య ఆధారంగా నిర్ణయించ‌డం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రెండు సార్లు మ్యాచ్ టై అయిన‌పుడు రెండు జ‌ట్ల‌ను విజేత‌గా ప్ర‌క‌టించి ఉంటె బాగుండేద‌ని క్రీడా పండితులు త‌మ అభిప్రాయాన్ని తెలిపారు.

తాజాగా ఫైన‌ల్ మ్యాచ్‌పై న్యూజిలాండ్ ఎప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్ స్పందించారు. విజేత‌ను బౌండ‌రీల ఆధారంగా నిర్ణ‌యించ‌డం సిగ్గుచేట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక ఆ బాధనంత దిగమింగుకొని ఇవాళ మీడియా ముందుకు వచ్చాడు కివీస్ కెప్టె… ఈ మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదని, అంతిమంగా మమ్మల్ని ఏదీ విడదీయలేదని.. ఇంగ్లండ్‌ జట్టు కప్పు గెలిచిన విజేత.. అంతే తేడా అని వ్యాఖ్యానించారు విలియమ్సన్. రెండు టీమ్‌లు సమానమై ఆటను ప్రదర్శించినప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేశాడు విలియమ్సన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -