Friday, April 26, 2024
- Advertisement -

పంత్ పై విమర్శలు….సపోర్ట్ గా నిలిచిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్‌

- Advertisement -

ధోని వారసుడిగా ఫామ్ లోకి వచ్చిన యువ క్రికెటర్ పంత్ కెరీర్ ఇప్పుడు డైలమాలో పడింది. పేవల ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. పంత్ మీద బీసీసీఐ పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవతున్నాడు. దీంతో అతని కెరీర్ ఇబ్బందుల్లో పడింది. సఫారాలతో జరిగిన టీ 20 సిరీస్ లో పంత్ విఫలం అయ్యారు. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతన్నాయి.

టీమిండియా కోచ్ రవిశాస్త్రి సైతం పంత్ ఆటతీరు పట్ల సదభిప్రాయంతో లేడన్న కథనాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా కెప్టెన్ కోహ్లీ ఎన్ని సార్లు హెచ్చరించినా పంత్ లో మాత్రం మార్పు రావడంలేదు.బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో కూడా విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ తన అభిప్రాయాలు వెల్లడించారు. రిషబ్ పంత్ దూకుడుగా ఆడే తత్వం ఉన్న ఆటగాడని, కానీ అంతర్జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో ఎలా ఆడాలో అతడికి తెలియడం లేదని వివరించారు.

ఎంఎస్‌ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన పంత్‌పై అధిక ఒత్తిడి ఉందని.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడిలో స్థైర్యాన్ని నింపాలన్నాడు. పంత్‌లో అపార ప్రతిభ దాగుందన్నాడు. మైదానం అన్నివైపులా షాట్‌లు కొట్టగల నైపుణ్యం ఉందని.. దూకుడు అతడి సొంతమని ప్రశంసించాడు. ఆటలో లోపం లేదని షాట్ల ఎంపికలోనె పంత్ విఫలం అవుతున్నారని అభిప్రాయపడ్డారు.పంత్‌ బ్యాటింగ్‌ సహజ లక్షణం దూకుడని అలాంటి ఆటగాడిని నాలుగో స్థానంలో కాకుండా ఐదు లేక ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపాలని సూచించాడు. విమర్శల నేపధ్యంలో పంత్ పై కోచ్ ఎలాంటినిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -