Friday, April 26, 2024
- Advertisement -

కోహ్లీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్న మాజీ క్రికెట‌ర్లు..

- Advertisement -

స్వ‌దేశంలో ఆసిస్‌తో వ‌న్డే సిరీస్ కోల్పోవ‌డంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెట‌ర్లు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. మొదటి రెండు వ‌న్డేల్లో గెలిచిన కోహ్లీసేన చివ‌రి మూడు వ‌న్డేల్లో చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా 3-2తో సిరీస్ కౌవ‌సం చేసుకుంది. ఇండియా ఓట‌మిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్ విమ‌ర్శ‌లు చేశారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అనాలోచిత నిర్ణయాలే కొంప‌ముంచాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే సిరీస్‌ గెలవకముందే ప్రయోగాలు చేయడం భారత పరాజయానికి కారణమని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.సిరీస్‌ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేసి ఉంటే బాగుండేద‌న్నారు. ప్రపంచకప్ ముంగిట జట్టు రిజర్వ్ బెంచ్‌ని పరీక్షించుకోవడం ముఖ్యమే.. కానీ.. సిరీస్‌లో విజేతగా నిలవడం అంతకన్నా కీలకమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

మూడో వన్డే ఓటమి అనంతరం మహేంద్రసింగ్ ధోని‌కి విశ్రాంతినివ్వడం.. సీనియర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడిపై వేటు వేయడం భారత విజయవకాశాలను దెబ్బతీశాయి. ధోని స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ వరుస తప్పిదాలు చేయగా.. కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమయిన సంగ‌తి తెలిసిందే.ఎల్ రాహుల్‌ని తప్పించి మరీ ఒక బౌలర్‌ని తీసుకోవడంతో ఛేదనలో భారత్‌కి ఇబ్బందిగా మారింది. ఈ త‌ప్పిదాలే భార‌త్ విజ‌యావ‌కాశాలకు గండి కొట్టింద‌న‌డంలో సందేహంలేదు.

మొద‌టినుంచి టీమిండియాకు మిడిల్‌ ఆర్డర్ చాలా స‌మ‌స్య‌గా మారింది. మిడిలార్డ‌ర్‌లో ఎంత‌మందిని ప‌రీక్షించినా ఎవ‌రూ కూడా నిల‌బ‌డ‌లేక‌పోయారు. వరల్డ్‌కప్‌ నాటికి మిడిల్‌ ఆర్డర్‌పై ఒక స్పష్టత రాకపోతే ఆ మెగా టోర్నీలో అది భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించాడు. ప్రధానంగా భారత యువ క్రికెటర్లు రిషభ్‌ పంత్‌, విజయ్‌ శంకర్‌లు చాలా నిరాశపరిచారన్నాడు. వారిద్దరూ ఘోరంగా వైఫల్యం చెందిన కారణంగానే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -